- సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు
- భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి చౌహాన్
హైదరాబాద్, ఏప్రిల్ 1 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా 7 మ్యచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ ఆదివారం మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్‌ల భద్రత ఏర్పాట్లపై రాచకొండ సీపీ చౌహాన్ డియా సమావేశంలో మాట్లాడారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ చౌహాన్ చెప్పారు. స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీపీ చౌహాన్. ప్రేక్షకులకు, సామాన్య ప్రజలకు, మ్యాచ్ కి వచ్చే ప్రముఖులకు, ప్లేయర్స్ కి.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ పెట్టామన్నారు సీపీ. క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమకు సహకరించాలని..పిచ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించొద్దని సూచించారు. సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాట్లును చేశామని చెప్పారు సీపీ చౌహాన్. లాస్ట్ టైం కంటే సీసీ కెమెరాలను పెంచామని..స్టేడియంలో ఇష్టమెచ్చినట్లు తిరగకూడదన్నారు. వాహనాలు నిలిపేందుకు స్టేడియం ఎంట్రీ దగ్గరే పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు సీపీ. అందరి సహకారంతో మ్యాచ్ విజయవంతం చేస్తామని పేర్కొన్నారు సీపీ చౌహాన్. టికెట్ల పంపిణీలో గందరగోళం తలెత్తకుండా సన్ రైజర్స్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సీపీ కోరారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.