నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

  • ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు
  • ప్రధాని పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌
  • నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…పలు రూట్లలో ట్రాఫిక్‌ ‌‌డైవర్షన్‌.

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత ఐఎస్‌బి సంస్థ వార్షికోత్వంలో పాల్గొంటారు. ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ‌ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ పర్యటనలో కెసిఆర్‌ ‌పాల్గొనడం లేదు. ఇక్రిశాట్‌ ఉత్సవాల సందర్భంగా దూరంగా ఉన్నట్లే ఇప్పుడు ఐఎస్‌బి ఉత్సవాలకు కూడా కెసిఆర్‌ ‌దూరంగా ఉండనున్నారు. ఇకపోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఐఎస్‌బీకి 5 కిలోవి•టర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, ‌మినీ ఎయిర్‌‌క్రాప్ట్‌లపై నిషేధం విధించారు. ఏరియల్‌ ‌వ్యూ కోసం లైవ్‌ ‌టెలికాస్ట్‌పై పోలీసులు నిషేధించారు. అటు ఐఎస్‌బీ, హెచ్‌సీయూ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేగంపేట, ఐఎస్‌బీ, సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు కొనసాగుతాయి.

గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్‌ ‌వరకు ఉన్న ఐటీ, ఇతర కంపెనీలు తమ ఆఫీస్‌ ‌టైమింగ్స్‌ను మార్చు కోవాలని సూచించారు. ఈ రూట్లలో వొచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ ‌వద్ద మలుపుతీసుకుని బొటానికల్‌ ‌గార్డెన్‌, ‌కొండాపూర్‌ ఏరియా దవాఖాన, మజీద్‌ ‌బండ కమాన్‌, ‌హెచ్‌సీయూ డిపో రోడ్‌ ‌వి•దుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్‌ ‌నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు..క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్‌, ‌హెచ్‌సీయూ బ్యాక్‌ ‌గేట్‌, ‌నల్లగండ్ల వి•దుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్‌ ‌నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్‌ ‌ఫీల్డ్ ‌హోటల్‌, ‌నానక్‌రాంగూడ రోటరీ, ఓఆర్‌ఆర్‌ ‌రోడ్‌, ఎల్‌ అం‌డ్‌ ‌టీ టవర్స్ ‌వి•దుగా వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్‌ ‌బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ ‌వైపు వెళ్లే వాహనాలు.. జూబ్లీహిల్స్ ‌రోడ్డు నం.45, మాదాపూర్‌ ‌పీఎస్‌, ‌సైబర్‌ ‌టవర్స్, ‌హైటెక్స్, ‌కొత్తగూడ, బొటానికల్‌ ‌గార్డెన్‌, ‌గచ్చిబౌలి జంక్షన్‌ ‌వి•దుగా దారిమల్లిస్తున్నట్లు చెప్పారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సిటీలోకి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రధాని పర్యటనకు సిఎం కెసిఆర్‌ ‌దూరం
ఇక ప్రధాని పర్యటనకు మరోమారు కెసిఆర్‌ ‌దూరంగా ఉంటున్నారు. బుధవారం సాయంత్రం బెంగుళూరుకు సీఎం కేసీఆర్‌ ‌వెళ్లనున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు మరోసారి కేసీఆర్‌ ‌దూరం కానున్నారు. గురువారం బెంగుళూరు నుంచి అన్నాహజారే స్వగ్రామం రాలె గావ్‌ ‌సిద్ధి వెళ్లనున్నారు. అటు నుంచి కుటుంబ సబ్యులతో కలిసి షిర్డీ వెళ్లి అక్కడ సాయినాథున్ని దర్శించుకోనున్నారు. 29, 30 తేదీల్లో బెంగాల్‌, ‌బీహార్‌ ‌రాష్ట్రాల పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గతంలో కూడా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వొచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ‌దూరంగానే ఉన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో అప్పటి ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ ‌దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి బెంగుళూరు టూర్‌ ‌కారణంగా దూరం కానున్నారు. కేసీఆర్‌ ‌కావాలనే ఇలా చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితీని కాలరాసిన కెసిఆర్‌ : ‌బిజెపి నేత లక్ష్మణ్‌
‌ప్రధాని మోదీ వొస్తున్నారనే సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రం విడిచిపోతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను లక్ష్మణ్‌ ‌బృందం పరిశీలించింది. కేసీఆర్‌ ‌నిబంధనలు పాటించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్‌ ‌చర్యలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎయిర్‌ ‌పోర్టులో పార్టీ తరఫున ప్రధానికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. ఎయిర్‌ ‌పోర్టులో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం లేదన్నారు. ప్రధానికి సీఎం స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్‌ ‌కాలరాశారన్నారు. రాష్ట్ర రైతులను వదిలి..ఇతర రాష్ట్ర రైతులకు డబ్బులు ఇస్తున్నారని లక్ష్మణ్‌ ‌విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *