నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ

  • హాజరు కానున్న సిఎం కెసిఆర్‌..‌గురుద్వారాలో ప్రత్యేక పూజలు
  • సభకు భారీగా ఏర్పాట్లు..పర్యవేక్షించిన మంత్రి ఇందకరణ్‌ ‌రెడ
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : నేడు మహారాష్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం వెలుపల నిర్వహించే తొలి సభ కావడంతో సార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో భాగంగా నాందేడ్‌లో ఆదివారం జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. కెసిఆర్‌ ఉదయం నాందేడ్‌కు వెళతారు. సిక్కు గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేస్తారు. సభాస్థలి వేదికను బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ ‌పట్టణంతోపాటు సభ స్థలికి వెళ్లే దారులన్నీ కిలోవి•టర్లమేర గులాబీ మయమయ్యాయి. అక్కడ వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు సభా స్థలిని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగి.. సభా వేదిక అలంకరణ, అతిథులు, ముఖ్య నేతల సీటింగ్‌పై నేతలకు దిశానిర్దేశర చేశారు.
బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా పార్టీలోని పలువురు నేతలు నాందేడ్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి గత వారం రోజులుగా నాందేడ్‌లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై సీఎం సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూనే.. విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అక్కడి వీధుల్లో కలియ తిరుగుతూ వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న కృషి గురించి తెలియజేస్తున్నారు.
మరోవైపు నాందేడ్‌ ‌జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్‌ఎస్‌ ‌సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. నాందేడ్‌ ‌జిల్లాలోని నాందేడ్‌ ‌సౌత్‌, ‌నార్త్, ‌బోకర్‌, ‌నాయిగాం, ముఖేడ్‌, ‌డెగ్లూర్‌, ‌లోహ నియోజకవర్గాలు, కిన్వట్‌, ‌ధర్మాబాద్‌ ‌పట్టణాలు, ముద్కేడ్‌, ‌నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్‌ ‌నగర్‌, ‌తదితర మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్‌ ‌జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌, ‌బోథ్‌, ‌ముధోల్‌, ‌బోధన్‌, ‌జుక్కల్‌తో పాటు నిర్మల్‌, ‌నిజామాబాద్‌ ‌నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు, శ్రేణులు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page