ఎండలు దంచి కొడుతున్నయ్
వడగాలులు దండిగా వీస్తున్నయ్
తాపాలు మెండుగా పెట్రేగుతున్నయ్
ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నయ్
హీట్ వేవ్స్ డెత్ బెల్స్ మోగిస్తున్నయ్
భానుడి ప్రతాప తాకిడికి
ప్రజానీకం తలడిల్లుతుంది
రాబోవు కాలం తీవ్రమనే వార్త
గుండెల్లో గుబులు పుట్టిస్తుంది
బతుకు భారంగా తలపిస్తుంది
పగలంతా మండే ఎండలు
రాత్రివేళ ఉక్కపోతకు తోడు
దోమల దండయాత్రలు వెరసి
దినదిన గండం బతుకు చందం
ఉపాధి కూలీలు, కార్మికులు
సామాన్యులు గడప దాటని
విడ్డూర కాలం దాపురించింది
జన సంచారం కానరాక
రహదారులు ,దుకాణాలు
వీదులన్నీ బోసిబోతున్నయ్
ఇంతటి క్లిష్ట సమయంలో
అందరూ జాగ్రత్తలు వహిస్తూ
ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే
మూగ జీవులను ఆదరించాలి
తల రుమాలు అస్త్రంగా
చేనేత దుస్తులు మంత్రంగా
చల్లని నీడలు రక్షిత క్షేత్రంగా
జలం జీవామృతంగా తలచి
ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలి
ఎండల గండం నుంచి గట్టెక్కాలి
(ఎండలు తీవ్రమవుతున్న సందర్బంగా…)
– కోడిగూటి తిరుపతి, :9573929493