నేడు కాంగ్రెస్‌ ‌రైతు సంఘర్షణ సభ

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు

వరంగల్‌/‌సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్‌ ‌గాంధీ రాకకోసం వరంగల్‌ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో నిర్వహించే రైతు సంఘర్షణ భారీ బహిరంగ సభకు వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బహిరంగ సభ నిర్వహణ కోసం మైదానంలో 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో రాహుల్‌ ‌గాంధీ కూర్చునే వేదిక, రెండోది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మరొక వేదికను ఏర్పాటు చేశారు. మరొకటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఈ మూడు వేదికలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతా మూడు రంగుల జెండాతో కూడిన పెద్ద పెద్ద బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నుండి వచ్చే జనం సునాయాసంగా నగరానికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. నగరంలో ఏ బజార్‌కి వెళ్లిన పెద్ద ఎత్తున భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. సభాస్థలి చుట్టూ పెద్ద ఎత్తున బ్యానర్లు జెండాలు రెపరెపలాడుతున్నాయి. పొలిమేర ప్రారంభంలో రాహుల్‌ ‌గాంధీ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏఐసిసి స్థాయి నుండి జిల్లాస్థాయి కాంగ్రెస్‌ ‌నాయకులు నగరానికి వచ్చి పోతూ ఉండటం ముఖ్యంగా ఏర్పాట్లను పర్యవేక్షించడం ప్రజలు ఉత్తేజానికి రేతీస్తున్నారు. యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి రాకకోసం కాంగ్రెస్‌ ‌పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విషయాన్ని చూస్తే కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి అన్ని జిల్లా నుండి భారీ ఎత్తున ప్రజలను తరలించే అవకాశం ఉంది. ఐదు లక్షల మంది సభకు హాజరు కావచ్చని అంచనా. సభకు వచ్చే విఐపి నాయకులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ప్రకాష్‌ ‌రెడ్డి పేట ప్రాంతంలో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల ఆడిటోరియం ప్రాంగణం విఐపి పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు ప్రధానమైన కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదార వైఖరి కారణమని, ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరోపణలను మనం గమనించవచ్చు. జరిగేది రైతు సభ కాబట్టి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తారని, కాంగ్రెస్‌ ‌నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ ‌గాంధీ పర్యటన నాలుగు గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌కు ప్రయాణమవుతారు. సరిగ్గా ఐదు గంటలకు ఫాతిమా నగర్‌లోని సెంట్‌ ‌గాబ్రియల్‌ ‌మైదానంలో హెలికాప్టర్‌ ‌దిగి అక్కడి నుండి రెండున్నర కిలోమీటర్లు సభ వేదిక వరకు ఓపెన్‌ ‌టాప్‌ ‌జీపులో రాహుల్‌ ‌గాంధీ సభా వేదిక వద్దకు వస్తారని, ఇందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దారి వెంబడి ఇరువైపుల బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేదిక వద్దకు చేరుకున్న తర్వాత రాహుల్‌ ‌గాంధీ ముందుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వారితో సమావేశమై మాట్లాడతారు. సరిగ్గా ఏడు గంటలకు సభ ప్రారంభం అవుతుంది. ఇంతకు ముందు గానే స్థానిక, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రసంగిస్తారు. రాహుల్‌ ‌గాంధీ వేదికపై వచ్చిన తర్వాత ముందుగా పిసిసి అధ్యక్షుడు మరికొంతమంది సభా వేదిక ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం రాహుల్‌ ‌గాంధీ గంటపాటు ప్రసంగించి అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాహుల్‌ ‌గాంధీ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సభా వేదిక కు వచ్చే విఐపి గ్యాలరీ, రాహుల్‌ ‌గాంధీ ప్రత్యేక భద్రత ఇప్పటికే సభా వేదిక పూర్తిగా పరిశీలించి సభ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసింది. ఏఐసిసి, పి సి సి, జిల్లాస్థాయి కాంగ్రెస్‌ ‌నాయకులు యూత్‌ ‌కాంగ్రెస్‌, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్‌ ‌బహిరంగ సభ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటించనున్నారు. బహిరంగ సభాస్థలికి వచ్చే జనం కోసం నగరంలోని ట్రాఫిక్‌ ఆం‌క్షలు నిర్వహించారు. సభ నిర్వహించే ప్రాంతం ట్రాఫిక్‌ ‌మన్నించి పక్క నుండి ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం కాంగ్రెస్‌ ‌నాయకులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటీ పేర్కొంది. మీడియా కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రైతు శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్‌ ‌చేపడుతున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా రైతులు ప్రజాసంఘాలు ఇతర వర్గాలను ఆసక్తి నెలకొంది 15 రోజులుగా ఏఐసీసీ నుంచి జిల్లా వరకు రైతు సందర్శన సభ నిర్వహణ ప్రణాళిక లో పాలుపంచుకున్నారు. ఆర్టస్ ‌కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా వేదిక అన్ని వైపుల నుండి కూర్చొని చూసిన కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయుటకు కాంగ్రెస్‌ ‌నాయకులు కలిసికట్టుగా ముందుకు పోతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ ‌ధ్యేయం

రాష్ట్రంలో దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులకు ఇవ్వవలసిన వారి సబ్సిడీని తగ్గించి కేవలం రైతుబంధు పేరుతో రైతులు నిలువు దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. గురువారం వరంగల్‌ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాలలో నివేదిక పరిశీలనకు ఇక్కడికి వచ్చిన చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే ఇబ్బందులను తొలగించే విధంగా రైతు ప్రణాళికను ప్రవేశపెడతామని రైతులు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం గిట్టుబాటు ధర లేకపోవడం బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులు తీర్చలేక పోవడం పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోవడం మొదలైన అంశాలతో రైతు అప్పులు తీర్చలేక గుండె పగిలి చనిపోతున్నారని, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణాలను మొత్తంగా మాఫీ చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందిస్తామని గతంలో రైతులకు అందించిన సబ్సిడీలను యధావిధిగా అందిస్తూ ఈ రైతుబంధు కూడా కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ ‌హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు రాజేందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులను మోసం చేసే ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ : ‌నరేందర్‌ ‌‌రెడ్డి

రాష్ట్రంలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు ఏ పంట పండించుకోవాలి లో ఏ పంట నమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 2002లో ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సెంటిమెంటుతో నేడు మల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ పాల్గొని రైతులకు భరోసా కల్పిస్తారని ఆయన అన్నారు హనుమకొండ అశోక హోటల్‌ ‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్‌ ‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రధానంగా చర్చించి రైతుల అభివృద్ధి కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌విడుదల చేస్తామని దీని ద్వారా రైతులకు ఒక భరోసా కాంగ్రెస్‌ ‌పార్టీ కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ ఎ‌ర్రబెల్లి స్వర్ణ టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page