నేటికి వీడ్కోలు!

చిరునవ్వు రువ్విన రోజు
నీటి బుడగలా రాలిపోతుంటే!
వేడినిటూర్పుల ఒక్కక్షణం
గాలిగుమ్మటంలా ఎగురుతోంది!

గడచినక్షణాలను గణిస్తుంటే
గడచిపోతున్నాయి యుగాలు!
కసాయి కాలచక్రాలు
కాస్తంత కూడా వెనక్కు
జరగటం లేదు!

కాలప్రవాహంలో
కొట్టుకుపోయిన వసంతాలను!
బ్రతుకుపుస్తక నందనంలో
మిగిలిపోయిన మోడులను!

విడిచిన నిట్టూర్పులను,
చిందించిన నవ్వులను
లెక్కవేస్తుంటే!

కొత్త యేడు కంగారుగా
కాళ్ళ దగ్గరకు వచ్చేసింది!
రానున్న వత్సరానికి స్వాగతం
పలికే ముందు నేస్తమా!

ఒక్కసారి
తిరిగిరాని వసంతానికి
వీడ్కోలు పలుకు!
మళ్లీ నీవైపు రాదు
నీజ్ఞాపకాలలో తప్ప!
మళ్లీ నిన్ను పలకరింపదు
నీ స్మృతి నీడలలో తప్ప!

అందుకే ఒక్కసారి
వీడ్కోలు పలుకు!
మరలి రాని వసంతానికి.
జ్ఞాపకంలా మిగిలిపోతున్న
వత్సరానికి!
******************
ఉషారం
9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *