పాట్నా,జనవరి4 : బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (బీఎస్ఎస్సీ)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాట్నాలోని బీఎస్ఎస్సీ ఆఫీసు ముందు బుధవారం ఉదయం విద్యార్థులు ధర్నా చేపట్టారు. పేపర్ లీకైన అంశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు.
అయితే విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. ఆందోళనకారులు హింసకు దిగారని, విధ్వంసం సృష్టించారని, వాళ్లను అదుపు చేసే పక్రియలో భాగంగా లాఠీఛార్జ్ చేసినట్లు పాట్నా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రే ఎంఎస్ ఖాన్ తెలిపారు. కొందర్ని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.