Take a fresh look at your lifestyle.

నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రయన్‌పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్‌పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్లున్న కంటైనర్‌ను  ఢీకొట్టింది. దీంతో కారులో ప్రమాయణి స్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను నిజామాబాద్‌ ‌జిల్లా బోధన్‌ ‌మండలం కండలివాడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారంతా హైదరాబాద్‌ ‌నుంచి స్వస్థలానికి వొస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. కారు మితివి•రిన వేగంతో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మృతదేహాలను నిజామాబాద్‌ ‌ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply