మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 – మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు, పత్రికా రచయిత, న్యాయవాది, ఆంధ్ర జనసంఘ స్థాపకులు, సంఘ సంస్కర్త, పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయ శాస్త్రంలో పట్టభద్రులు అయినారు. పర్షియన్ భాషలో కూడా అయన గొప్ప పండితులు, పత్రికా రచయితగా పేరు పొందారు. 1921లో ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలు చేపట్టారు.
1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టారు. మందుముల, సమర రంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. బాల్య వివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషి చేశారు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పని చేశారు. నిజాం కాలంలోని దుష్ప రిపాల నను వర్ణిస్తూ ‘‘50 సంవత్సరాల హైద రాబాదు’’ గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించారు.
మందుముల నరసింగరావు…
టేకుమాల రంగారావు, మాడపాటి హనుమంత రావు, మిట్ట లక్ష్మీనరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకి రామయ్య, బూర్గుల రామకృష్ణా రావు, బోయినపల్లి వెంకట రామారావు, కొమ్మవరపు సుబ్బారావు బూర్గుల నరసింహా రావు, డాక్టర్ పందింటి రామస్వామి నాయుడు తదితరులతో కలిసి ‘ఆంధ్ర జనసంఘం’ను స్థాపించారు.హైదరాబాద్ సంస్థాన ఆధునిక చరిత్రలో రావి నారాయణరెడ్డి, ముఖ్దూం మొహియుద్దీన్ వంటివారు అతివాద వర్గం ప్రతినిధులు కాగా, బూర్గుల రామ కృష్ణారావు, మందుముల నరసింగ రావు, మాడపాటి హనుమంత రావు, మాదిరాజు రామకోటీశ్వర రావుతదితరులు మితవాదులు.
భువనగిరిలో జరిగిన ఆంధ్రమహా సభలకు వివిధ గ్రామాల నుండి ఎడ్ల బండ్లపై వచ్చిన వారు…రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణరావు లాంటి ప్రముఖులను ఎడ్ల బండ్ల మీద ఊరేగించారు. ఆయన బాల్య వివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశారు. 1952లో కల్వకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ ‘‘50 సంవత్సరాల హైదరాబాదు’’ గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు. యాభై ఏళ్ల హైదరాబాదు నగర సమగ్రచరిత్ర ఈ గ్రంథం. హైదరాబాదు రాజకీయ సామాజిక జీవనంలో ప్రధానపాత్ర పోషించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు కలం నుండి వెలువడిన రచన. ప్రత్యక్ష సాక్షిగా ఆయన కథనం.మందుముల నరసింగరావు కూతురు అనంతలక్ష్మిని బూర్గుల రామకృష్ణారావు రెండో వివాహం చేసుకున్నారు. సమర యోధుడిగా పేరుపొందిన మందుముల రామచంద్రారావు ఆయన సోదరుడు. మార్చి 12, 1976 న మందుముల మరణించారు.
– ప్రజాతంత్ర డెస్క్