నార్సింగ్‌లో ఇంజనీర్‌ హత్య కేసు ఛేదన

అక్రమ సంబంధం కాణంగానే హత్య
వివరాలు వెల్లడిరచిన పోలీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : నార్సింగిలో దారుణ హత్యకు గురైన ఇంజనీర్‌ ఇదాయత్‌ ఆలీ హత్య కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఇంజనీర్‌ గా పనిచేస్తున్న ఆలీకి గోల్కండ ప్రాంతానికి చెందిన  సీమా బేగంతో అక్రమ సంబంధం ఉంది. అయితే హిదాయత్‌ దుబాయ్‌ వెళ్లిన తరువాత ఓ ఫంక్షన్‌ లో ఆమెకు సయ్యద్‌ ఆరిఫ్‌ తో పరిచయం ఏర్పడిరది. ఆరిఫ్‌ వీడియోగ్రాఫర్‌ గా పనిచేస్తాడు. అయితే ఆరిఫ్‌తో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.  దీంతో సీమా ఇద్దరితో అక్రమసంబంధాన్ని కొనసాగించింది.

పదిహేను  రోజుల క్రితం ఆలీ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ కు వచ్చేశాడు. తిరిగి దుబాయ్‌ వెళ్తున్న క్రమంలో  సీమా బేగాన్ని కలవాలని..  మంచిరేవులకు వచ్చాడు.  కారులో  సీమాతో శృంగారం చేస్తుండగా ఆరిఫ్‌ వీడియోలో రికార్డు చేశాడు.  దీంతో ఆలీని బెదిరించడం మొదలుపెట్టాడు.  డబ్బులు ఇస్తానని ఆలీ బ్రతిమిలాడాడు.  ఈ క్రమంలో మాట్లాడుకుందామని ఓ నిర్మానుష ప్రాంతానికి వెళ్లిన ఇద్దరికి అక్కడ మాట మాట పెరగడంతో ఆరిఫ్‌ తన వద్ద ఉన్న కత్తితో  ఆలీని పొడిచి దారుణంగా హత్య చేశాడని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కేసులో  సీమా, ఆరీఫ్‌లను అరెస్టు చేసినట్లుగా వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *