ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నారీ శక్తి వందన్ అధినియం అని అనెంప్లాయిస్ ఫోరం చైర్మన్ అనూజ్ కుమార్ స్పష్టం చేశారు. బిల్లును స్వాగతిస్తున్నామని, బిసి స్త్రీలకు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటం సంతోషకరం అన్నారు. మహిళలను శక్తిగా గుర్తించి, గౌరవించే సంస్కృతి భారత దేశానిదని అన్నారు. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగడం వల్ల నిస్సందేహంగా భారత్ శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయన్నారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందడం మన పార్లమెంట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయని అన్నారు. ఇందుకు సహకరించిన ఎంపీలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మహిళా నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్లు ఒక గొప్ప ఫలితాలు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కొంత తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని అని డిమాండ్ చేసారు. 2018 టిఆర్ఎస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు స్టైఫండ్ ఇస్తామని అదికారంలోకి వచ్చి ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు.