రైతులకు అండగా ఉండేందుకే రాహుల్ రాష్ట్ర పర్యటన
నిర్ణయాలు వరంగల్ వేదికగా రాహుల్ ప్రకటిస్తారు
వరంగల్ సభకు రైతులంతా తరలిరావాలి
నిజాం ఆస్తులను మించిన కెసిఆర్ ఆస్తులు
వి•డియాతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావుకు రేవంత్ కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : తెలంగాణ రైతులను మోసం చేసేందుకు టిఆర్‌ఎస్, బిజెపిలు రెండూ పోటీ పడుతున్నాయని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో బీజేపీ, టీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకే రాహుల్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనేది ప్రకటిస్తామన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి అవధులు లేవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం సంపదను మించిపోయాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ చేయబోతున్న యుద్దానికి రైతులు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ టీఆర్‌ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన.. పాలనాపగ్గాలు చేపట్టాక రైతుల కోసం ఏం చేయబోతున్నామన్నది రాహుల్ సభలో ప్రకటిస్తామని చెప్పారు. అన్నదాతలకు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తామని హవి• ఇచ్చారు. వరంగల్ సభకు రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నీ తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో 2004నాటి బంగారు పాలన అందిస్తామని చెప్పారు. కేసీఆర్ అవినీతికి అవధుల్లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. చివరకు యాదగిరి నర్సింహ స్వామి దేవాలయ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రూ.2000కోట్లతో నిర్మించిన దేవాలయంలో కేసీఆర్ కుటుంబ అవినీతి దాగి ఉందని రేవంత్ మండిపడ్డారు.
అమరవీరుల స్థూపం విషయంలోనూ ఇదే జరగుతోందన్న ఆయన.. రూ.62 కోట్లతో మొదలుపెట్టిన పనులు, రూ.200కోట్లు చెల్లించినా పూర్తి కాలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ సంపద నిజాం వారసుల సంపదను మించిపోయిందని సటైర్ వేశారు.
రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావుకు రేవంత్ కౌంటర్
రాహుల్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి కూడా లేని వ్యక్తి మంత్రి హరీష్ రావని పిసిసి చీఫ్ రేవంత్ మండిపడ్డారు. ఏం చేయడానికి రాష్ట్రానికి వొస్తున్నారని మంత్రి హరీష్ రావు రాహుల్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌కు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్‌ఇచ్చారు. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్’ అని ప్రశ్నించారు. నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలు అల్పులకు అర్థం కావని హరీష్‌ను విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, అర్హత హరీష్‌కు లేవని రేవంత్ దుయ్యబట్టారు.