ధాన్యం కుప్పలపై రైతు గుండె ఆగినా స్పందించరా..?

  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్ది మండిపాటు
  • రైతు సమస్యలు, టీఆర్‌ఎస్‌ అవినీతిపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, ‌కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ‌వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారనీ, పండించిన పంట కొనకపోవడంతో ధాన్యం కుప్పల పైనే రైతుల గుండె ఆగిపోతే ప్రభుత్వం స్పందించలేదని పీసీసీ చీప్‌ ఎ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాలు తెవరడంలో ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా ఇప్పటికే 30 శాతం ధాన్యం మిల్లర్లు, దలారుల చేతుల్లోకి వెళ్లి రైతులు భారీగా నష్టపోయారని మండిపడ్దారు. బుధవారం రైతు సమస్యలు, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతిపై రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ‌ప్రతినిధుల బృందం గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది.

అనంతరం ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ధాన్యం కుప్పలపై రైతు గుండె ఆగిపోతుంటే ప్రభుత్వం కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.1960గా ప్రకటిస్తే మిల్లర్ల, దళారులు కేవలం రూ.1300కే కొన్నారనీ, ఇప్పటి వరకూ రైతులకు జిరగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఏ రైతులు తక్కువ ధరకు పంటను అమ్మారో ఆ వివరాలు మిల్లర్ల దగ్గర ఉన్నాయనీ, ఆ రైతలకు రూ.600 వెంటనే ప్రభుత్వం ద్వారా ఇప్పించాలనీ గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దనీ, రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారనీ, 12 నెలల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ ‌చెలగాటం ఆడుతున్నారనీ, పీసీసీ పోరాటం వల్లనే కేసీఆర్‌ ‌ధాన్యం కొనుగోలు ప్రకటన చేశారన్నారు. వచ్చే నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామనీ, పైసలు ఉంటే మందే కొనొచ్చుగా, దిల్లీలో ఎందుకు ధర్నా చేశారు. కేసీఆర్‌ ‌చేసేదంతా చూస్తంటే ఇదంతా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌డ్రామాలాగాకనిపిస్తోంని కోమటిరెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *