- రైతుల మేలు కోరుకుంటే పార్లమెంటులో కొట్లాడండి
- రాహుల్ ట్వీట్‌పై మంత్రి హరీష్ రావు, ఎంఎల్‌సి కవిత కౌంటర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 29 : తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆందోళన చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును సభలో నిలదీయాలని చేయాలని ఆయన సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ట్వీట్ ఇస్తూ ఆయనపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్‌కు మంత్రి చురకలంటించారు. ఒకే దేశం ఒకే సేకరణపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో వి• పరువును మీరే తీసుకోవద్దని ఈ సందర్భంగా హరీష్ రావు జూచించారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో రాహుల్‌కు కౌంటర్ ఇస్తూ…వి•రు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు..వి•కు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వొచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి..ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉందని అంటూ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.