దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు పడ్డ ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. నిరుద్యోగం చెప్పడానికి లేదు. ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు అసలు లేకుండా పోయాయి. యువత సర్టిఫికెట్లు పట్టుకుని విదేశాలకు వెళ్లున్నారు. ఈ దేశంలో బతకలేమని కూలీలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ఉప్పులు, పప్పులు మొదలు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. గృహ సంబంధ సిమెంట్, ఇసుక, ఇనుము తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. సామాన్యులు ఇల్లు కొనుక్కుని బతికే అవకాశం లేకుండా చేశారు. కేవలం ప్రభుత్వం కట్టించే ఇళ్లపై ఆధారపడేలా చేస్తున్నారు. ఇదంతా కూడా అభివృద్దికి చిహ్నమా అన్నది చర్చించాలి. ప్రధాని మోడీ చెబుతున్న వికసిత్ భారత్‌కు ఇదంతా నిదర్శనంగా చూడాలి. బేటీపడావో..బేటీ బచావో నినాదంగా మారింది. అమ్మాయిలు చదువుకునే పరిస్థితి లేదు. కనీసం బాలికా విద్యకు అవసరమైన రుణాలకు కూడా వెసలుబాటు లేదు. ఈ క్రమంలో బిజెపి ప్రకటించిన మేనిఫెస్టోలో ఈ అంశాలేవీ చర్చించలేదు. సరికదా స్పృశించలేదు.
దేశంలో రైతులు కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. దీంతో ఈ వర్గాన్ని ఆకట్టుకునేం దుకు రెండు పార్టీలు ప్రయత్నిం చాయి. వ్యవసాయాన్ని సాంకేతికతను జోడిరచడంతో పాటు.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను బలోపేతం చేస్తామని బీజేపీ హావ్ని ఇచ్చింది. కనీస మద్దతు ధరపెంచుతామని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. వ్యవసాయ ఫైనాన్స్‌పై శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చింది. నిజానికి వ్యవసాయ రంగం అతిపెద్ద పరిశ్రమగా పాలకులు గుర్తించడం లేదు. దీనిని గుర్తించి అనుబంధ పరివ్రమలు చేపడితే దేశంలో సగం నిరుద్యోగం పోతుంది. అలాగే దేశీయంగా పంటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కానీ రెండు పార్టీలు ఈ రంగంపై పెద్దగా విశ్లేషణ చేయడం లేదు. మహిళా సాధికారత సాధించే దిశగా గ్రావ్నిణ మహిళలను లక్షాధికారులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపింది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు షరతులు లేకుండా ఏడాదికి లక్ష రూపాయిలు నేరుగా ఖాతాల్లో జమచేస్తామని తెలిపింది. 2025 నుంచి మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు. ప్రతి జిల్లాలో కనీసం ఒక సావిత్రీ బాయి ఫూలే హాస్టల్‌తో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలు పొందే విధంగా బీమా పథకం అమలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లలో అన్ని పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తామిన కాంగ్రెస్ తెలిపింది. ఇలాగే వెళితే దేశంలో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వాళ్లు బతకడం కష్టం కాగలదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావ్నిలు అమలు కావడం లేదు. పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారేలా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ‘న్యాయ్ ప్ర’ పేరుతో బీజేపీ ‘సంకల్ప్ ప్ర’ పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, బీజేపీ తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. మోదీ గ్యారెంటీ క్యాప్షన్‌తో బీజేపీ సంకల్ప్ ప్ర విడుదల చేయగా..మహిళలు, యువత, నిరుపేదలు, రైతులు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ న్యాయప్రను రూపొందించింది. ఓ రకంగా చెప్పాలంటే రెండు పార్టీలు యువతను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ఎందుకంటే యువ ఓటర్ల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది.
బీజేపీ తన మేనిఫెస్టోలో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని హావ్ని ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాలీలను సత్వరమే భర్తీ చేశామని, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కానీ పదేళ్ల పాలనా కాలంలో ఉద్యోగాల కల్పన అన్నది లేకుండా పోయింది. ప్రచారాడంబరం తప్ప ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడుతుంది. ఉన్నత చదువులు చదివినా కొలువులు కానరావడం లేదు. దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని బిజెపి మరోమారు యువతను మోసం చేసే ప్రయత్నం చేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మద్దతుగా ముద్ర రుణాల పరిమితిని పెంచుతామని కూడా పేర్కొంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన హావ్నిని ప్రకటించలేదు. అయితే ఇందుకు భిన్నంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువ న్యాయ్ కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 25 ఏళ్లలోపు యువకుల కోసం రైట్ టు అప్రెంటీస్‌షిప్ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హావ్ని ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అధికారంలో ఉన్న బిజెపి మాత్రం ప్రభుత్వ ఖాళీల భర్తీకి ముందుకు రాలేదు. ఇకపోతే సీనియర్ సిటిజన్ల కోసం రెండు పార్టీలు తమ మేనిఫెస్టోలో వివిధ హావ్నిలు ఇచ్చాయి. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు అందిస్తామని తెలిపింది. తీర్థయాత్రలు చేపట్టే సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను కఠినంగా అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద పెన్షన్‌ను వెయ్యి రూపాయిలకు పెంచుతామని చెప్పింది. సీనియర్ సిటిజన్లకు ప్రజా రవాణాలో ప్రయాణ రాయితీలను పునరుద్దరిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. రెండు పార్టీలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తమ మేనిఫెస్టోలో పథకాలను పొందుపర్చాయి. కానీ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఈ రెండు పార్టీలకు లేదని గతంలో వీరి పాలనా కాలం తీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు
-ఆర్‌ఎన్‌ఎ




