రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు
డబుల్ ఇంజిన్ కాదు..గ్రోత్ ఇంజిన్ కావాలి
మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది
చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్..కెసిఆర్‌లు మాత్రమే
ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్ ఉద్వేగ ప్రసంగం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్ ఉందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందమైన పూలబోకేలా ఉన్న భారతదేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ ఈ దేశానికి అవసరం అన్నారు. కేసీఆర్ భారతదేశ ప్రగతికి బంగారు బాటలు వేయాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా కేటీఆర్ ప్రసంగించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని మోదీ గొప్ప ప్రసంగాలు చేస్తారు.. కానీ మోదీ ప్రభుత్వంలో వికాస్ అన్నది వింత పదమైందని కేటీఆర్ విమర్శించారు. విద్వేషమే నాలుగు పాదాల వి•ద నుడుస్తోంది. సోషల్ వి•డియా ద్వారా సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఏడేండ్లలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలి. వ్యవసాయ అనుకూల పథకాలు దేశమంతా అమలు కావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. గ్రోత్ ఇంజిన్ సర్కార్ కావాలి. గోల్‌మాల్ మోడల్, బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ కాదు.. గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక నిర్మాణాత్మకమైన సంస్థలో ఒక కార్యకర్తగా, వి•లో ఒకడిగా 75 ఏండ్ల స్వాతంత్య్ర అనంతరం ఒక సగటు భారతీయుడిగా, ఒక తండ్రిగా భవిష్యత్ తరం గురించి ఆవేదనతో ఆందోళనతో రెండు మాటలు మనవి చేసుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ దేశం పేదదేశంగా ఉండాలి. కులపిచ్చి, మతపిచ్చి రేపే సంస్థల ఎజెండా, రెచ్చగొట్టే ఉద్వేగాలకు లోనవుదామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక మతానికి సంబంధించి జరిగిన ఊరేగింపులో ఇంకో మతాన్ని కించపరచమని ఏ దేవుడు చెప్పిండు? నా పేరు చెప్పి కొట్టుకు చావండని ఏ దేవుడు చెప్పిండు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ నినాదాన్ని సాకారం చేసే నాయకుడిని ఈ దేశం కోరుకుంటోంది..1987లో చైనా, ఇండియా జీడీపీ పరిమాణం ఒక్కటే. కానీ ఈ రోజు మన జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లు. చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందన్నారు. యన తలసరి ఆదాయం 1800 డాలర్లు ఉంటే.. చైనా 9 వేల డాలర్లకు ఎగబాకిందని కేటీఆర్ తెలిపారు. మేరా భరత్ మహాన్ అనే నినాదాన్ని సాకారం చేసే నాయకున్ని భారతదేశం కోరుకుంటోంది. ఆ నాయకుడిని తెలంగాణ అందిస్తుందని మనసారా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఓ వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఇద్దరే మహానుభావులు చరిత్రలో నిలబడిపోయారు. మొదటి వ్యక్తి ఎన్టీఆర్, రెండో వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు.. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేశారని కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రాష్టాల్రకు సీఎంలు ఉంటారు.
కానీ మన తెలంగాణకు రాష్టాన్న్రి సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది గొప్ప విషయమన్నారు. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు కేసీఆర్‌ను ఉద్దేశించి ఒక మాట అన్నారు. జీవితంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యాలు నిర్ణయించుకుంటారు. కానీ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. కానీ వి•రు ఆ లక్ష్యాన్ని జీవితకాంలోనే చేరుకున్నారు. వి•రు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. వి• జీవితం ధన్యమైపోయిందని ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఈ రాష్టాన్న్రి సాధించారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువుదీరింది. ఆ ప్రభుత్వంలో తనకు మంత్రి అవకాశం వచ్చింది. మంత్రిగా నాటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కూడా ఒకసారి కలిశాం. ఆయన ఒక మాట ఉన్నారు. భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూశాం. పరిపాలకులను కూడా చేశాం. కానీ కేసీఆర్ లాంటి రేర్ వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నామని జైట్లీ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణను భారతదేశానికే దిక్సూచిగా మార్చారు సీఎం కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. అవినీతి రహితంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇవాళ తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం మొత్తం ఆచరించక తప్పదు అనే స్థాయికి తెలంగాణ చేరుకుంది. 75 ఏండ్ల స్వాతంత్య్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్నవారే. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారు. మన రైతుబంధు కేంద్రానికి ప్రేరణ అయింది. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. టీఎస్ ఐపాస్ అనే పథకాన్ని కాపీ కొట్టి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాల ప్లోరోసిస్‌ను.. నాలుగేళ్లలో ఆ సమస్యకు పరిష్కారం చూపారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.