Take a fresh look at your lifestyle.

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ‌దొందూ దొందే

  • రాష్ట్రంలో కెసిఆర్‌ ‌కుటుంబ పాలన
  • సబ్బండ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
  • కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ….‌చత్తీస్‌గఢ్‌ ‌ముఖమంత్రి భూపేష్‌

‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం కరీంనగర్‌ ‌జిల్లాకు చేరింది. అనంతర కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆశేష ప్రజానీకం హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ‌మాట్లాడుతూ…రాహుల్‌ ‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు భారత్‌ ‌జోడో యాత్ర చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. సోనియాగాంధీ ఈ స్టేడియంలోనే తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారని, సబ్బండ వర్గాల అభివృద్ధి చెందాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాలు ముందుకు తీసుకెళ్లేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే జరుగుతున్నాయన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ‌దొందూ దొందేనని ఏద్దేవా చేశారు. సోనియా కలలు కన్న సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని, అప్పుడే తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు. చత్తీస్‌గఢ్‌ ‌ముఖమంత్రి భూపేష్‌ ‌మాట్లాడుతూ…తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ ‌నేత సోనియాగాంధీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, తమ రాష్ట్రంలో రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో రైతులు పండించిన దాన్యానికి క్వింటాలుకు 6500 గిట్టు బాటు ధరను చెల్లిస్తున్నామన్నారు.

తమ ప్రభుత్వం పాడి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వామే రానున్నదని  జోస్యం చెప్పారు. దేశంలో పేదలను ఆదుకునేదీ కాంగ్రెస్‌ ‌పార్టీ అని, సామాజిక తెలంగాణ  కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమన్నారు. అనంతరం మాజీ ఎంపి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ఆది శంకరాచార్య తరువాత దేశమంతా తిరిగిన వ్యక్తి రాహుల్‌ ‌గాంధీ మాత్రమేనని కొనియాడారు. విద్వేషాన్ని వీడి దేశ సమైక్యతను కాపాడాలని రాహుల్‌ ‌సందేశం ఇచ్చారన్నారు. ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చూసి ఇక్కడి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. తెలంగాణలో వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని అన్నారు. తామంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామని,.రాష్ట్రంలో బీఆరేస్‌, ‌బీజేపీ లను బొంద పెట్టాలని పిలుపు నిచ్చారు. ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌మాదిరిగా మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆ హామీని గాలికొదిలేశారన్నారు.

సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలమని, దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారన్నారు. కరీంనగర్‌ అం‌టేనే పోరాటాల గడ్డ అని, తెలంగాణ వొచ్చింది కానీ నిధులు మాయమైపోయాయన్నారు. ఎక్కడా ప్రాజెక్టులు రాలేదని, ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదన్నారు. ప్రాణహితకు అంబేద్కర్‌ ‌పేరును తొలగించారని, లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో కట్టిన ప్రాజెక్టులలో పారే నీటితోనే పంటలు పండుతున్నాయన్నారు. భూమి లేని నిరుపేదలకు రూ.7వేలు ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌ప్రభుత్వం ఇస్తుందన్నారు. కానీ ఇక్కడ బీఆరెస్‌ ‌ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వడంలేదన్నారు. ఏమీ ఇవ్వని తెలంగాణలో రూ.5లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.పక్కనున్న ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌రాష్ట్రం అప్పు కేవలం రూ.83వేల 125 కోట్లు మాత్రమనన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, ఏఐసీసీ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సభకు చత్తీస్‌ఘడ్‌ ‌ముఖ్యమంత్రి భుపేష్‌ ‌భగెల్‌ ‌ముఖ్య అతిథిగా పాల్గొనగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ ‌రమేష్‌ ఎం‌పీ, ఏఐసీసీ ఇంచార్జ్ ‌మానిక్‌ ‌రాం రాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు మాజీ కేంద్రమంత్రి కొప్పుల రాజు, రోహిత్‌ ‌చౌ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపిలు ఉత్తమకుమార్‌ ‌రెడ్డి, కొ మటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ టీ. జీవన్‌ ‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, మొలుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, వీరయ్య, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు జానారెడ్డి, షబ్మీర్‌ అలి, పొన్నాల లక్ష్మయ్య, సీతారాం నాయక్‌, ‌రేణుకా చౌదరి, సురేశ్‌ ‌పట్కర్‌, అం‌జనీ కుమార్‌ ‌యాదవ్‌, ‌సిరిసిల్ల రాజయ్య నల్లు రవి.. వి.హన్మంతరావు లతోపాటు ఏ సీపీ సీనియర్‌ ‌నాయకులు, కరీంనగర్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్‌ ‌మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌ ‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్‌, ‌వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌, ‌జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మన్‌ ‌కుమార్‌, ‌చొప్పదండి నియోజవర్గం ఇన్చార్జీ మేడిపల్లి సత్యం, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌ ‌రెడ్డి, పిసిసి నాయకులు వైద్యుల అంజన్‌ ‌కుమార్‌, ‌రూరల్‌ ఇన్చార్జి మెనేని రోహిత్‌ ‌రావు సి. సి. వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కోమటిరెడ్డి పద్మాకర్‌ ‌రెడ్డి, యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్లమెంట్‌ అధ్యక్షులు పదాల రాహుల్‌, ‌మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి,మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎండి తాబ్‌, ‌బీసీ సెల్‌ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్‌, ఎస్‌ ‌టి సెల్‌ అధ్యక్షులు శ్రావణ్‌ ‌నాయర్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్‌ ‌రెహమాన్‌, ‌నగర కాంగ్రెస్‌ ‌మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సయ్యద్‌ అఖిల్‌, ‌నిహాల్‌, ‌ఫోరండ్ల రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply