ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు
ముంబై, ఏప్రిల్ 6 : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోవడంతో .. భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది..
ఒమిక్రాన్ రూపంలో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.. మరో విషయం ఏంటంటే.. యూకేలో జనవరి 19వ తేదీన ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ’ఎక్స్ఈ’పై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.