మోడీ నిరంకుశ విధానాలపై ఉమ్మడి పోరాటం
అఖిలేశ్‌తో భేటీలో తాజా రాజకీయాలపై సిఎం కెసిఆర్ చర్చ
నేడు చండీఘర్‌కు సిఎం…రైతు కుటుంబాల పరామర్శ
న్యూ దిల్లీ, మే 21 : దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్..సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇరువురు నేతలు దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. దేశంలో మోడీ నిరంకుశ విధానాలను నిలదీస్తూ ప్రజలను ఏకతాటి పైకి తీసుకుని వొచ్చే అంశాలపై ఇరునేతుల చర్చించారని తెలుస్తుంది. ఇప్పటికే బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు, బలవంతపు సంస్కరణల అమలు, నిధుల కేటాయింపులో వివక్ష వంటి అంశాలపై రాష్ట్రాల హక్కులను బలంగా ప్రశిస్తున్న కేసీఆర్ ఇవే విషయాలను అఖిలేశ్‌తో చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ వేదికగా ఒక్కటి కాకపోతే బిజెపి ఒంటెత్తుపోకడలను నిలువరించలేమని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వొచ్చారని తెలుస్తుంది.
దేశంలో గతంలో ఎప్పుడూ లేనంతగా బిజెపి నిరంకుశ విధాలను అవలంబిస్తుందని కెసిఆర్ ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వొచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చించినట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ వి•డియా ప్రముఖులతో కేసీఆర్ సమావేశమవనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.