దేశంలో పెరుగుతున్న కోవిడ్‌-19 ‌కేసులు

  • ఎనిమిది రోజుల్లో 8 ఇంతలు..
  • అప్రమత్తంగా ఉండాలి..జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు
  • మాస్క్‌కు మించి ఇతర కఠిన నిబంధనలు అవసరం లేదంటున్న నిపుణులు

దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌గత వారంలో భారత్‌లో కోవిడ్‌ -19 ‌కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఏప్రిల్‌ 18 ‌నాటికి కొత్తగా నమోదైన కేసులు 2,183 గా కనిపించాయి. దీని తరవాత రోజు ఏప్రిల్‌ 19 ‌నాడు 2,514 తాజా కేసులు నమోదయ్యాయి. స్పష్టమైన కేసుల పెరుగుదల కనిపించింది. ఇది దేశ రాజధానిలో కనిపించిన పెరుగుదల. దేశవ్యాపితంగా చుస్తే ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కోవిడ్‌-19 ‌సోకిన వారి మొత్తం సంఖ్య ఏప్రిల్‌ 18 ‌నాటికి 11,542 నమోదు అయినాయి. మంగళ వారం అంటే ఏప్రిల్‌ 26 ‌నాటికి కోవిడ్‌-19 ‌కేసులు దేశవ్యాపితంగా 15,636 గా నమోదు అయినాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, వీక్లీ పాజిటివిటీ రేటు ఏప్రిల్‌ 18‌న 0.32 శాతం నుండి 0.54 శాతంకి పెరిగింది. ఏప్రిల్‌ 18‌న కోవిడ్‌ ‌పరీక్షల సంఖ్య 2.6 లక్షల నుండి ఏప్రిల్‌ 25 ‌నాటికి 3.02 లక్షలకు పెరిగింది.

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 ‌సంబంధిత ఆంక్షలు మొత్తం  తొలగించబడిన కొన్ని వారాల అనంతరం కోవిడ్‌-19 ‌కేసులలో ఈ పెరుగుదల చూస్తున్నాం. భారతదేశంలో కోవిడ్‌-19 ‌కేసుల పెరుగుదల ఎక్కడ ఎక్కువగా వున్నదని పరిశీలిస్తే ప్రధానంగా దిల్లీ..దీని పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానాలలో ఎక్కువగా కనబడుతున్నాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన 2,541 కేసుల్లో దాదాపు 1,000 దిల్లీలోనే ఉన్నాయి. మాస్క్ ఆదేశాలను తొలగించిన దాదాపు రెండు వారాల తర్వాత ఏప్రిల్‌ ‌మధ్యలో దిల్లీలో కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. మాస్క్ ఆదేశాలు తిరిగి దిల్లీలో, హర్యానాలోని నాలుగు జిల్లాలలో, దిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. జనవరిలో కేసుల పెరుగుదల తక్కువగా ఉండి ఆ తరువాత, ఏప్రిల్‌ ‌మధ్య నుంచి దిల్లీలో కోవిడ్‌ ‌కేసుల సంఖ్య పెరగడం మొదలైనది. గత ఐదు రోజులుగా దాదాపు 1,000 తాజా కేసులు నమోదవడంతో ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది. మొదటిలో తక్కువ అవుతున్న కొరోనా కేసుల సంఖ్యలను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి.

ఏప్రిల్‌ ‌ప్రారంభంలో మాస్క్ ఆదేశాలు తొలగించబడ్డాయి. అయితే  ఏప్రిల్‌ ‌మధ్య నుండి, దేశ రాజధానిలో కేసుల సంఖ్య దాదాపు రెండు వారాల్లో 100 నుండి 1,000కి పెరిగాయి. ఈ కేసుల పెరుగుదల నేపథ్యంలో మనం ఆందోళన చెందాలా? ఈ ప్రశ్నకు ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్‌లోని ఎపిడెమియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్‌ ‌లలిత్‌ ‌కాంత్‌ ఇలా చెబుతున్నారు ‘‘ప్రజలు మాస్క్‌లు తొలగించటం ప్రారంభించిన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుందనే అంచనా ముందే వుంది. కేసుల సంఖ్యలో క్రమానుగతంగా హెచ్చుతగ్గులు చూస్తాం. ముఖ్యంగా గమనించాల్సింది కోవిడ్‌ ‌నుంచి సంభవించే తీవ్రమైన వ్యాధులను మరణాల సంఖ్యను.’’ ఇప్పటివరకు హాస్పిటల్స్‌లో చాలా తక్కువ అడ్మిషన్లు నమోదు అయినాయి.  లోక్‌ ‌నాయక్‌, ఆల్‌ ఇం‌డియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ ‌వంటి పెద్ద హాస్పిటల్స్ ఇన్‌ఫెక్షన్‌తో కొన్ని అడ్మిషన్లను చూపాయి. చాలా మందికి అధిక జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వొస్తున్నాయని, అయితే మూడు నుంచి ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

మరణాల సంఖ్య చుస్తే స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ కోవిడ్‌ -19 ‌కేసులు పెరగడం ప్రారంభించినప్పటి నుండి గత 14 రోజుల్లో కోవిడ్‌ -19 ‌కారణంగా 10 మరణాలు నమోదయ్యాయి. అయితే అంతకు ముందు 14 రోజులలో ఆరు మరణాలు నమోదయ్యాయి. సంభవిస్తున్న మరణాలు తీవ్రమైన ఇతర సహ-అనారోగ్య వృద్ధాప్య కారణంగా రోగులలో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బహుశా ప్రస్తుతం కోవిడ్‌ -19 ‌కేసుల పెరుగుదలపై  ఆందోళన చెందటానికి  ఇంకా సమయం వుందనుకున్నా కానీ మనం వైరస్‌ ‌గురించి జాగ్రత్త వహించడం మాత్రం ఆపేయకూడదు. జాగ్రత్తలను కొనసాగించాలి. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మరిన్ని ఆంక్షలు అవసరమా అనే ప్రశ్న మనముందు ఉంది.

కోవిడ్‌ 19 ‌కేసులు పెరగడం ప్రారంభించిన తర్వాత, దిల్లీ డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ మాస్క్‌లు ధరించక పొతే 500 రూపాయల జరిమానాను విధించటం తిరిగి ప్రవేశపెట్టింది. ప్రజలు  మాస్క్ ‌ధరించడం అమలు చేయాలని నిపుణులు గాట్టిగా చెబుతున్నారు. అయితే ఈ తరుణంలో మాస్క్ ‌ధరించడానికి మించిన ఆంక్షలు పెంచాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఎపిడెమియాలజిస్ట్ ‌డాక్టర్‌ ‌చంద్రకాంత్‌ ‌లహరియా మాట్లాడుతూ..‘‘మాస్కింగ్‌ ఆదేశాలు ఇతర పరిమితులను మనం ఎంతకాలం కొనసాగిస్తాం? ప్రస్తుతం, ప్రజలకు సోకిన ఇన్ఫెక్షన్‌ ‌తేలికపాటిది. దీనికి లాక్‌డౌన్‌లను అమలు చేయడం లేదా పాఠశాలలను మూసివేయడం వంటి చర్యలు అవసరం లేదు.’’ అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page