- తాజాగా 2,380 మందికి పాజిటివ్
- అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 21 : దేశంలో కొరోనా కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఫోర్త్ వేవ్ మొదలైన సూచనలు కనిపిస్డుడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 24 గంటల్లో 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,380 కొరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు. 1231 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 13,433 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,49,974 కొరోనా కేసులు నమోదు అయ్యాయని, 5,22,062 మంది మృతి చెందగా..4,25,14,479 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
అయినా దేశంలో కోవిడ్ ఫోర్త్‌వేవ్ రాలేదని, అయినా ముందస్తు చర్యలు పాటించాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పేర్కొంది. దేశంలో దిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మిజోరామ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మళ్ళీ కొరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి : దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కొరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. బుధవారం నిర్వహించిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. పాఠశాలలు తెరిచి ఉంచాలనే డిసీషన్ తీసుకున్నారు.

దిల్లీలో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కొరోనాతో చనిపోయిన వారి శాంపిళ్లలో 97 శాతం ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మహమ్మారితో చనిపోయిన వారికి సంబంధించిన 578 శాంపిళ్లను జన్యుక్రమ పరిశీలనకు పంపించగా వారిలో 560 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు తేలింది.