దిల్లీకి సిఎం రేవంత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. దిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page