‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి, పోషిస్తున్నాయి.ఆధునిక, శాస్త్ర సాంకేతక,గ్లోబలైజేషన్‌ ‌కాలంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా తప్పనిసరి.ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత హైద్రాబాద్‌ ‌నగరం ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగాల్లో  అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తు అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌గా మారింది. అంతర్జాతీయంగా వచ్చే ఉపాధి అవకాశాలను మన పేద విద్యార్థులు అందిపుచ్చుకోవల్లన్న,విభిన్న రంగాల్లో వస్తున్న శాస్త్ర సాంకేతిక మార్పులను మన విద్యార్థులు ఆకళింపు చేసుకోవల్లన్న ఆంగ్ల మాధ్యమ విద్యా తల్పనిసరి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఆంగ్ల మాధ్యమ ప్రాధాన్యాన్ని గుర్తించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారు ఆంగ్ల మాధ్యమంలో గురుకుల వ్యవస్థను ప్రోత్సహించారు.కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా  రాష్ట్ర వ్యాప్తంగా 299 మాత్రమే ఉన్న గురుకులాలను సుమారు ఒక వెయ్యి  వరకూ నెలకొల్పి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ గురుకుల వ్యవస్థను బలోపెత్తం చేస్తుంన్నారు.అందులో 4.5 లక్షల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఆధునాతనమైన వసతులు,ఆధునిక ల్యాబులు, ఆత్యాధునిక కంప్యూటర్‌ ‌సౌకర్యాలు,మంచి గ్రంధాలయం,మంచి ఆట స్థలం,పరిశుభ్రమైన కిచన్‌ ‌షెడ్లు,చక్కటి డైనింగ్‌ ‌హాల్స్ ‌మొదలైన వసతులతో గురుకుల వ్యవస్థ అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పుతూ పరుగులు తీస్తుంది.తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో సంవత్సరానికి ఒక్క విద్యార్తికి సుమారు ఒక లక్ష 20 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తుంది.

సుదూర స్వప్నాన్ని కాంక్షించగల మన గౌ’’ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారు తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా,ఈ పోటీ ప్రపంచంలో అట్టడుగు పేదవారికి కూడా అభిరుద్ది ఫలాలు అందాలంటే ఆంగ్ల విద్యా ఆవశ్యకతను గుర్తించి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడం చారిత్రక నిర్ణయం.ఆంగ్ల మాద్యమం ప్రారంభించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చుటకు మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశపెడుతూ 7,289 కోట్ల రూపాయలు కేటాయిస్తుండడం శుభపరిణామం.మొదటి విడతలో భాగంగా 9,123 పాఠశాలలకు 3,497 కోట్ల రూపాయలు,రెండవ విడతలో 9,123 పాఠశాలకు,మూడవ విడతలో 7,826 పాఠశాలకు మిగిలిన నిధులు కేటావిస్తూ 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
మన ఊరు-మన బడి పథకం వల్ల తెలంగాణలో విద్య విప్లవం ప్రారంభం అయింది.ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారు తున్నాయి. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, ప్రతి క్లాస్‌ ‌కు, అన్ని ల్యాబులకు నిరంతర విద్యుత్‌ ‌సరఫరా,అన్ని తరగతులకు డ్యూయల్‌ ‌డెస్క్ ‌ఫర్నిచర్‌,‌పాఠశాలలకు రంగులు, సున్నాలు వేయడం,డస్ట్ ‌చాక్‌ ‌బోర్డుల స్థానంలో గ్రీన్‌ ‌బోర్డుల ఏర్పాటు,అన్ని పాఠశాలలకు ప్రహరు గోడల నిర్మాణం,పొగ దుమ్ము ధూళి లేకుండా కిచన్‌ ‌షెడ్ల నిర్మాణం,విద్యార్థులు పాఠశాలల ఆవరణలో తినకుండా భోజన శాలలు నిర్మింస్తున్నారు. విద్యార్థులందరికి డిజిటల్‌ ‌విద్యాను అందుబాటులోకి తెస్తున్నారు.ఆధునాతనమైన కంప్యూటర్‌,‌సైన్స్  ‌ల్యాబులు ఏర్పాటు చేస్తున్నారు.మన ఊరు – మన బడితో తెలంగాణలో పాఠశాలల ముఖ చిత్రమే మారుతుంది.

తెలంగాణ దశాబ్ది కాలంలో విద్యారంగంలో సాధించిన ప్రగతిని ప్రశంసించిన్నపటికి నాణెనికి బొమ్మ బోరుసువలే విద్యా రంగంలో వెనుకబాటు కూడా కొనసాగుతుంది.మనం ఆశిస్తున్న ‘‘గురుకుల విద్యా విధానం’’అన్ని రకాలు కలిపి సుమారు 1000 వరకు ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉండవచ్చు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో  ఆ పాఠశాలల శాతం 3.33% మాత్రమే.మొత్తం విద్యార్థులలో 10శాతం మాత్రమే ఆ గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారు.వారు మాత్రమే  ప్రభుత్వ ద్వారా నాణ్యమైన మౌలిక సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్‌ ‌విద్యను పొందుతున్నారు.ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న 97.69%( ప్రభుత్వ,జిల్లా,మండల) పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చదువుతున్నారు.అంటే వారు ప్రభుత్వం యొక్క నాణ్యమైన మౌలిక సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్‌ ‌విద్యా అందుకోవడం లేదనమాట.నాణ్యమైన మౌలిక సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్‌ ‌విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? ప్రభుత్వ,జిల్లా పరిషత్‌ ‌పాఠశాలల్లో  విద్యార్తులు ఆశించిన ఫలితాలను ఎందుకు అందుకోలేకపోతున్నారు?.ప్రయివేట్‌ ‌పాఠశాలలకు విద్యార్థులు ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు?  దీనికి ఏ ఒక్కరిని బాధ్యులను చెయ్యలేము.ఉపాధ్యాయులు ఉంటే మౌలిక సదుపాయాలు ఉండవు,మౌలిక సదుపాయాలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు. ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాలు ఉన్న విద్యార్థులు హాజరుకారు.విద్యార్థి ఉపాధ్యాయులుల నిష్పత్తి చాలా బాగాఉన్న, ఉన్న దగ్గర అవసరనికన్న ఎక్కువ ఉపాధ్యాయులు,లేని దగ్గర అవసరనికన్న తక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు.దీనిని సరి చేయవలసిన అవసరం ఉంది.చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసైనా ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారు.విద్యార్థులు ప్రవేశ పరీక్షల ద్వారా  గురుకులాల్లో చేరిపోతున్నారు. విద్యార్థులందరూ వెళ్ళిపోయిన తర్వాత, పేదరికంలో ఉన్న విద్యార్థులు,గురుకులాల్లో సీటు రాని విద్యార్థులు, తల్లిదండ్రులు వలసపోయిన విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ ,జిల్లా పరిషత్‌ ‌పాఠశాలల్లో చేరుతున్నారు.ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాపై ఉన్న శ్రద్ధ ,ప్రభుత్వ,జిల్లా పరిషత్‌ ‌పాఠశాలకు విద్యార్థిలను పంపిన తల్లిదండ్రులకు ఉండడం లేదు.అందుకు వారిని తప్పు పట్టలేము. బతుకుదెరువుకోసం వలస వెళ్తుంటారు,నిరక్ష్యారాసులై ఉంటారు,విద్యా ప్రాధాన్యత తెలిసి ఉండరు.

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ‌పాఠశాలల పర్యవేక్షణ గురించి చూస్తే , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్నజిల్లాలు ఏర్పడడంతో  జిల్లా ఉపవిద్యాశాఖాధికారుల అవసరం ఉండదని ప్రభుత్వం భావించి ఉండవచ్చు, అందుకే ఆ పోస్టులను పూర్తిగా రద్దు చేసింది.చిన్న జిల్లాలను మనం స్వాగతించాల్సిందే ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు బాగా అందుతున్నాయి.కొత్త జిల్లాలు ఏర్పడ తరువాత  పర్యవేక్షణ అధికారులను నియమించక పోవడం వల్ల పాఠశాలల్లో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది.రాష్ట్ర వ్యాప్తంగా 528 మండల విద్యా శాకాధికారి పోస్టుల్లో  20 మంది మాత్రమే రెగ్యులర్‌ ‌వారు ఉన్నారు,508 మండలాల్లో ఇంచార్జిలతో నెట్టుకొస్తున్నారు.95% మండల విద్యాశాఖాధికారి పోస్టులు  ప్రధానోపాధ్యాయులచే ఇఛార్జి రూపేణా నెట్టుకొస్తున్నారు.ప్రధానోపాధ్యాయులు అటు మండలం పై సరిఅయిన పర్యవేక్షణ చేయలేక  ఇటు తన పాఠశాలకు న్యాయం చేలేకపోతున్నారు.ప్రస్తుతం ఎం ఈ ఓ బాధ్యతలను కాంప్లెక్స్ ‌ప్రధానోపాధ్యాయు లకు అప్పగించారు.అది కొంతవరకు మంచిదే అయిన వారుకూడా అటు మండలానికి ఇటు తన పాఠశాలకు న్యాయం చేయలేరు. కాబట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు  బాద్యులను నియమించాలి.4379 ప్రధానో పాధ్యాయులకు గాను 2423 మంది మాత్రమే పనిచే స్తున్నారు.1956 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.ఉపాధ్యాయులు ఏ  క్యాడర్‌ ‌లో నియమితులయ్యారో అదే క్యాడర్‌ ‌లో సుమారు 20 నుండి 25 సంవత్సరాలు ప్రమోషన్‌ ‌లేక పనిచేయాల్సి వస్తుంది.దీనితో ఉపాధ్యాయ లోకం నిరుత్సాహంలో ఉన్నారు.

అటువంటి వారి నుండి ఫలితాలు ఎలా రాబట్టగలం? కాబట్టి అన్ని  స్థాయిల్లో వెంటనే ప్రమోషన్స్ ‌చేపట్టాలి.సర్వీస్‌ ‌రూల్స్ ‌కు దశాబ్దాల కాలాలూగా పరిష్కారం లభించడం లేదు.ప్రభుత్వ దృష్టి పెడితే ఏదో ఒక పరిష్కారం దోరుకుతుంది.అట్టి పరిష్కారం వెతికి విద్యా వ్యవస్థను ఉత్తేజపరచాలి.రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.ఆంగ్ల మాధ్యమం విజయవంతం కావాలంటే వెంటనే పదోన్నతులు కల్పించి కొత్త నియామకాలు చేపట్టాలి.ఇక్కడ  ముఖ్యంగా చర్చిం చాల్సింది ఏకోపాధ్యాయ పాఠశాలల గూర్చి.ఈ పాఠశాలలలో ఆంగ్ల మాద్యమం విజయవంతం కావాలంటే పాఠశాలలను విలీనం చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, పాఠశాలకు ఒక ప్రధానో పాధ్యాయుడు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి..ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గుదలకు అసలు కారణం ప్రభుత్వ చిన్నచూపు కదా? కొఠారి కమిషన్‌ ‌సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ ‌లో విద్యకు 30% నిధులు కేటాయించాలి.ఈ సంవత్సరం (2023-24)మన రాష్ట్ర బడ్జెట్‌ ‌లో విద్యకు కేటాయించింది 19093 కోట్లు(6.57%) మాత్రమే.గత సంవత్సరం(2022-23) మన రాష్ట్ర బడ్జెట్‌ ‌లో విద్యకు కేటాయించింది 16085 కోట్లు(6.55%)మాత్రమే,అది గత సంవత్సరం(2021-22) కేటావించిన 13608 కోట్లతో (5.89%)పోల్చుకుంటే కొంత ఎక్కువైన ద్రవోల్బనంతో పోల్చితే తక్కువే. తెలంగాణ లో దశాబ్ది కాలంగా విద్యా రంగంలో  అభిరుద్ది సాధించామన్నది ఎంత నిజమో ఆ వృద్ది కేవలం 10% విద్యార్థులకే పరిమితం అయిందనేది అంతే నిజం.దశాబ్ది కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి సుస్థిరంగా కొనసాగాలంటే విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి పరిష్కా రించాలి.తెలంగాణ సర్వతో మూఖాభివృద్దిలో సభండ వర్గాలను భాగస్వాములను చేయాలి.
image.png
జుర్రు నారాయణ యాదవ్‌
‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌
‌జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌ ‌నగర్‌, 9494019270.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *