దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి-కేటీఆర్‌

‌దళితులనే కాదు రాష్ట్రంలోని మిగతా వర్గాలను కూడా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. దళితబంధు పథకంతో దళితుల రూపురేఖలు మార్చడానికి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చిన్న పనులు చేసే వ్యక్తి కాదని, ఆయన ఒక రిఫార్మర్‌ అన్నారు.

దళితబంధు నిధులతో అందరూ వాహనాలే కాకుండా వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్నారు. రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలన్నారు. దేశంలో మంచి పని చేయడానికి లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయని, అయితే  చెడు పని చేయడానికి ఒక్కటి అడ్డంరాదని చెప్పారు. దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చని సలహా ఇచ్చారు. కొత్త ఆలోచనలు చేసి దళితబంధును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *