దళితుల స్ధితిగతుల ఆధ్యయానానికి కమిషన్ వేస్తామమని పార్టీలు హామీ ఇవ్వాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో దళితుల స్థితిగతుల ఆధ్యాయనానికి ఎస్సీ కమిషన్ వేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పిశంకర్ డిమాండ్ చేశారు.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు‌ డిబిఎఫ్   రూపొందించిన దళిత్ మ్యానిపేస్టోను  దుబ్బాక లో శంకర్ విడుదల చేశారు .ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.తరతరాలుగా అంటరానితనం కుల వివక్ష ,అణచివేత,దొపిడి,పీడన లకు గురవుతునాణ్యమైనవిద్య,ఉద్యోగం ,వైద్యానికి,భూమి,ఉపాధి,సంపదకు,రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా నెట్డివేయబడ్డ దళితుల సంక్షేమం ,అభివృద్ది,రక్షణలకు   సమగ్ర అబివృద్ధికి కట్టుబడి వుంటూ దళిత సాధికారతకు  సాధించెందుకు రాజకీయ పార్టిలు ఎన్నికల మ్యానిపెస్టో లలో హామీఇవ్వాలని డిమాండ్‌ చేశారు.స్వేచ్చ,, సమానత్వాన్ని,సొదర భావాన్ని అందించిన భారత రాజ్యాంగ రక్షణకు కట్టుబడి వుండాలి.రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్దమైన విధానాలను అమలు చేయబోమని,రాజ్యాంగాన్ని మార్చబోమని హమి ఇవ్వాలన్నారు.రాజ్యాంగ పిఠికను పాఠశాలలో ప్రార్ధన సమయంలో ప్రతిజ్ఞచేయించాలని, ,.మహనీయులైన బుద్దుడు,పూలె,సావిత్రి బాయి,అంబేద్కర్ తదితరుల అలోచనలను ప్రచారం చేయాలన్నారు.తెలంగాణ వైతాళికులు భాగ్యరెడ్డి వర్మ,బత్తుల శ్యామ్ సుందర్,వెంకట్రావు లతో పాటు ప్రజాయుద్ద నౌక గద్దర్ జీవితాలను పాఠ్యాంశాలలో చేర్చాలి.ట్యాంక్ బండ్ పై విగ్రహలను పెట్టాలని .గద్దర్ పేరును మెదక్ జిల్లాకు పెట్టాలని కోరారు.గాంధీ, అంబేద్కర్ ల మధ్య జరిగిన పునా ఒప్పందాన్ని  సమీక్షించి,కమ్యూనల్ అవార్డు ను తిరిగి అమలు చేయాలన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం పెంచి.అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితుల ప్రత్యేక ప్రతినిధి ని , జనరల్ ప్రతినిధిని ఎన్నుకునె పాత పద్దతిని అమలు చేయాలని,దళితులకు రెండు వోట్లు వేసే పద్దతిని సైతం తిరిగి అమలు చేయాలన్నారు.విద్యకు బడ్జెట్ లో 20 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.తరగతి వారి విద్యా సామర్థ్యాలను,నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత ఇంగ్లీషు, కంప్యూటర్, వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విద్యను  అందించాలన్నారు.  ప్రభుత్వ విద్యను పరిరక్షించి బలోపెతం చేయాలన్నారు.విశ్వవిద్యాలయాల పట్ల వివక్షను విడనాడాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,హస్టల్ లు గురుకులాలలో అన్ని పూర్తి సదుపాయలు పెంపొందించాలన్నారు. స్వత భవనాలను నిర్మించాలి.సిఎం అల్పాహారం, మధ్యహ్నన భోజన పధకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు.మధ్యాహ్న బోజన మహిళ కార్మికులకు నెలకు పదివేల వెతనాలనుచెల్లించాలన్నారు.ప్రిమెట్రిక్,పొస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను పెంచి ఇవ్వాలన్నారు.ఉపాధ్యాయ,లెక్షరర్,ప్రోపెసర్ల ఖాళీలను భర్తి చేయాలన్నారు.విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు.పాఠశాలలో పూర్వ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టాలని,
ప్రతి మండల కేంద్రం లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా ప్రవేటికరణను ఆరికట్టాలన్నారు. విదేశీ విద్యాలయాల్లో ఉన్నత చదువులు చదివెందుకు అమలు చెస్తున్న అంబేద్కర్ విద్యానిధిపధకానికి 20 లక్షల నుండి 50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 20 మంది పిల్లలు వున్న చోట అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు.ముఖ్యంగా దళిత వాడలలో,వలస కార్మికుల పని ప్రదేశాలలో అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పౌష్టికాహారాన్ని అందజేసి ,ప్రి ప్రైమరీ పాఠశాలలను సమర్ధవంతంగా కొనసాగించాలన్నారు..అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు లాగనే వెతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల నియామాకాలలో రిజర్వేషన్ లను పాటించాలన్నారు.దళిత బంధు పథకానికి పది లక్షల నుండి 25 లక్షలకు పెంచాలని,దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యే ల నుండి తీసివెసి అన్ని పధకాల లాగా  అన్ లైన్ లో దరఖాస్తు విధానాన్ని అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి.దళిత చిరు వ్యాపారులు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగొలు చేయాలన్నారు.చిరు వ్యాపారులకు వివిధ రంగాల పై శిక్షణ ఇవ్వాలన్నారు.దళిత బంధుతో పాటు ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకు లింకేజిని తొలగించి యధావిధిగా పధకాలను అమలు చేయాలన్నారు. పధకాల అమలులో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధన్యాం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
పొరాటాల ద్వారా సాధించుకున్నభూ సంస్కరణ అమలు చేయాలి,భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల  భూ పంపిణీ ని చట్టబద్దంగా పంపిణి చేయాలన్నారు.పేదలకు పంపిణి చేసిన భూములను ప్రజా ప్రయోజల పేరుతో స్వాధీనం చేసుకొవద్దని,అసైన్డ్ భూములను కాపాడాలన్నారు. .అన్యాక్రాంతమైన భూములను తిరిగి భూమి లేని దళితులకు ఇవ్వాలన్నారు. అసైన్డ్ భూముల హక్కుల కల్పన పేరుతో పెదల భూములను పెద్దలకు ధారాదత్తం చేయవద్దన్నారు.పహణిలోని అనుభవ దారు కాలాన్ని తిరిగి చెర్చి పేదలకు భూమి పై చట్టబద్ద  రక్షణలు,హక్కులు తిరిగి కల్పించాలి.ధరణి ని రద్దు చేయాలన్నారు.భూమి రిజిస్రెషన్ సమయంలో పాత పద్దతి లో గ్రామ పంచాయితి వద్ద నోటిస్ అతికించాలన్నారు.. సాదాబాయినామాల ద్వారా పేదలు కొనుగొలు చెసుకున్న భూములకు పట్టాలను అందజేయాలన్నారు.పేదలు పొరాడి సాధించుకున్న భూములకు పట్టాలు ఇవ్బాలి. భూ ప్రక్షాళన పేరుతో భూస్వాములు తిరిగి కొట్డెసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని దళితులకు పేదలకు పంచాలన్నారు.
మహిళలకు భూమి పై హక్కులు కల్పించాలి. వారిని రైతులుగా గుర్తించాలన్నారు.ప్రభుత్వ భూ పంపిణి ,పంటరుణాలు,వ్యవసాయ పధకాల అమలు లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.డిజిటల్ రికార్డు లతో పాటు మ్యాన్యువల్ భూ రికార్డులను కొనసాగించాలన్నారు..కాళేశ్వరం వివిధ ప్రాజెక్టు ల నిర్మాణం ద్వారా సాగు నీటి సౌకర్యం పెరిగిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నందున భూ సిలింగ్ పరిమితిని పది ఎకరాలకు తగ్గించాలని, అ భూముల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకు,దళితులకు పంపిణీ చేయాలన్నారు.ఎస్సీ లగృహలకు ఉచిత విద్యత్ ను200 యూనిట్లకు పెంచాలి. దళిత వాడలలో,మండల,జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ భవనాలనాలను నిర్మించాలన్నారు.ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధుల కేటాయింపు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు..బడ్జెట్ ను దారి మళ్ళించకుండా దళితుల అభివృద్ధి కి ఖర్చు చేయాలన్నారు..బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల పై రాష్ట్ర,జిల్లా స్ధాయిలలో చట్ట ప్రకారం మానిటరింగ్ కమిటిలు చేయాలన్నారు.ఎస్సీ ల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లను పెంచాలన్నారు.ప్రవెట్ రంగంలో రిజర్వేషన్‌లను అమలు చేయాలని,.ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్ లలో రిజర్వేషన్ లను అమలు చేయాలి.బ్యాక్ లాగ్ పొస్టులను భర్తి చేయాలన్నారు.రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్దమైన EWS రిజర్వేషన్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సీ ల ఆదాయ పరిమితిని రెండు లక్షల నుండి 8 లక్షలకు పెంచాలన్నారు.సామాజిక భద్రత 2020సామాజిక భద్రత  కోడ్ నిబంధనలలో అసంఘటిత  కార్మికులుగా గుర్తించాలన్నారు.గృహ కార్మికుల,భవన నిర్మాణ సంక్షేమ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.గృహ కార్మికుల సంక్షేమం,అభివృద్ధి రక్షణలకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలన్నారు.వ్వవసాయ,ఉపాధి హమి,గృహ, తదితర అ సంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు,ప్రమాద,అరోగ్య భీమా సౌకర్యం కల్పించాలన్నారు.నిరుద్యోగ యువతకు,ఉపాది,ఉద్యోగాలు కల్పించాలి.వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలన్నారు.స్వయం ఉపాధి రంగాలలో ఉపాధి అవకాశాలను పెంపొందించాలి.పట్టణ ఉపాధి హమిని ప్రవేశపెట్డాలని కోరారు.
దళితుల పై దాడుల నివారణకు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ,అంటరానితనం నిర్మూలన కు
 చర్యలకు నిర్దిష్ఠ ప్రతిపాదనలు ప్రకటించాలని కోరారు..పౌరహక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల నిర్వహించి రాజ్యాంగం,హక్కలు,చట్టాల పై అవగహన కల్పించి అసమానతలను రూపు మాపాలన్నారు.దళితుల పై దాడులకు పాల్పడే నిందితులకు 41 సిఅర్ పిని వర్తింప చేయవద్దని డిమాండ్ చేశారు.బాధితులకు చట్ట ప్రకారం తక్షణ సహయం,నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ఎస్సీ ఎస్టీకమిషన్ కు న్యాయ
 అధికారాలను కల్పించాలి. కమిషన్ లో,జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటిలలో రాజకీయ నిరుద్యోగులను సభ్యులు గా నియమించ వద్దు. ఎస్సీ ఎస్టీ స్వతంత్ర సంఘాల నాయకులను,విశ్రాంత జడ్జిలను సభ్యలుగా నియమించాలని కోరారు.మంత్రాలు,బాణమతి తదితర మూఢనమ్మకాలను నిర్మూలించాలన్నారు..మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేస్తని హమి ఇవ్వాలని కోరారు. ప్రజలలో  సైంటిఫిక్ టెంపర్ నుపెంపొందించాలన్నారు .కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నఉపాధి హమీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం బడ్జెట్ ను తగ్గించి పధకాన్ని ఎత్తివేకు చెస్తున్న కుట్రలు మానుకొవాలని డిమాండ్ చేశారు.పనిదినాలను వంద నుండి 200 రోజులకు,కనీస వేతనాన్ని 800 లకు పెంచాలన్నారు.
,కాంట్రాక్టు ఔట్ సొర్సింగ్ తదితర ఉద్యోగులకు సుప్రీం కొర్టు తీర్పు ప్రకారం నెలకు 20 వేల వేతనాలను చెల్లించాలని కోరారు.డబుల్ బెడ్ రూమ్ లునివాస హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు.గృహ లక్ష్మీ పధకానికి 3 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని కొన సాగించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికె నిర్మించిన ఇళ్ళను పేదలకు ఇవ్వాలి, మధ్యలో అగిపొయిన  ఇళ్ళను యుద్దప్రాతిపాదికన పూర్తిచేసి రోడ్డు,డ్రైనేజి,నీరు,విద్యుత్,మంచీనీటిని సరఫరా చేయాలన్నారు.పట్టణ ప్రాంతాలలోని హోమ్ లెస్ వారికి పక్కా షెల్టర్లను నిర్మించాలి. నాణ్యమైన ఆహరాన్ని అందించాలి.హోమ్ ల నిర్వహణ కు బడ్జెట్ పెంచి ప్రభుత్వమే హోమ్ లను నడపాలన్నారు.ఆరోగ్యానికి రాష్ట్ర బడ్జెట్ లో 4 శాతం నుండి 8 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెవాలి.ప్రతి నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి లను నిర్మించాలన్నారు..పల్లె,బస్తి దవాఖానాలను,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను బలొపెతం చేసి  24 గంటల పాటు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని హక్కుగా అందించాలన్నారు.ఆశ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను అందించాలన్నారు.2011 కౌలు దారు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి వ్వవసాయ పధకాలైన రైతు బంధు,రైతు భీమా తదితర పధకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు పధకాన్ని 5 ఎకారాలకు పరిమితం చెసి దళిత రైతులకు ఎకరానికి  20 వేలు ఇవ్వాలన్నారు.పంటలకు కనీస మద్దతు ధరలను చెల్లించాలని కొరారు..రుణ మాఫి ని పూర్తి స్ధాయి లో అమలు చేయాలి.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.
 కుటుంబాలను విచ్చిన్నం చేస్తు,యువతను వ్యసనాలకు, బానిసలుగా మారి తద్వారా హింస ను ప్రెరెపిస్తున్న మద్యం,గంజాయి,డ్రగ్స్ తదితర మత్తు పదార్ధాలను నిషెధించాలని డిమాండ్ చేశారు. 2016 వికాలాంగుల  హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు  చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో  డిబిఎఫ్ సినియర్ నాయకులు దత్తం స్వామి,డిబిఎఫ్ జిల్లా  ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్, డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page