తొలి వన్డేలోనూ అవే తప్పులు

లక్నో,అక్టోబర్‌7: ‌లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమ్‌ ఇం‌డియా ఓడిపోయింది. మొదటినుంచి చెలరేగి ఆడిన సఫారీలు విజయాన్ని అందుకున్నారు. చివరి టీ ట్వంటీ లో ఓడినటీమిండియా తిరిగి అదే రిపీట్‌ ‌చేసింది. నిర్లక్ష్యంగా ఆడడంతో పరాజయం తప్పలేదు.భారత్‌-‌దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ‌లక్నో వేదికగా జరిగింది. మొదట టాస్‌ ‌గెలిచి టీమ్‌ ఇం‌డియా బౌలింగ్‌ ఎం‌చుకుంది. అయితే వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటల తర్వాత మ్యాచ్‌ ‌ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అయితే మొదటినుంచే దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు.

భారత్‌కు 250 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా.. క్యాచ్‌లను చేజార్చడం టీమ్‌ఇం‌డియా పాలిట శాపమైంది. తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ‌ఠాకూర్‌ 2, ‌రవి బిష్ణోయ్‌, ‌కుల్దీప్‌ ‌యాదవ్‌ ‌చెరో వికెట్‌ ‌తీశారు. ఓపెనర్లు జానేమన్‌ ‌మలన్‌ 22 ‌పరుగులు, క్వింటన్‌ ‌డికాక్‌ 48 ‌పరుగులు చేసి తొలి వికెట్‌కు 49 పరుగులను జోడించారు. అయితే మలన్‌తోపాటు టెంబా బవుమా 8 పరుగులు, ఎయిడెన్‌ ‌మార్‌‌క్రమ్‌ ‌డక్‌ ఔట్‌ అయ్యి పెవిలియన్‌కు చేరడం వల్ల దక్షిణాఫ్రికా కష్టాల్లో పడినట్లు అనిపించింది. అయితే 65 బంతుల్లో 74 పరుగుల చేసిన హెన్రిచ్‌ ‌క్లాసెన్‌.. ‌డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. శార్దూల్‌ ‌ఠాకూర్‌ ‌బ్రేక్‌ ఇవ్వడం వల్ల డికాక్‌ ఔటయ్యాడు.

అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 63 బంతుల్లో 75 పరుగు?ల చేసి డేవిడ్‌ ‌మిల్లర్‌ ‌కీలకంగా నిలిచాడు. డేవిడ్‌ ‌మిల్లర్‌?‌తో కలిసి క్లాసెన్‌ ‌నిర్మించిన 139 పరుగుల భాగస్వామ్యం.. సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఫీల్డింగ్‌ ‌తప్పిదాల వల్ల లభించిన లైఫ్‌లను చక్కగా వినియోగించుకొని వీరిద్దరూ అర్ధశతకాలు చేశారు.నంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇం‌డియాకు మొదటిలోనే ప్రతిఘటన ఎదురైంది. ఆరు ఓవర్లు పూర్తి కాక ముందే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇద్దరు ఓపెనర్లు శిఖర్‌ ‌ధావన్‌ 16 ‌బంతుల్లో 4 పరుగులు, శుభ్‌మన్‌గిల్‌7 ‌బంతుల్లో 3 పరుగుల పేలవ ప్రదర్శన చేసి పెవిలియన్‌ ‌చేరారు. అనంతరం వచ్చిన రుతురాజ్‌ ‌గైక్వాడ్‌ 42 ‌బంతుల్లో 19 పరుగులు చేశాడు.

ఆ తర్వాత ఇషాన్‌ ‌కిషన్‌ 37 ‌బంతులలో 20 పరుగులు చేశాడు. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ ‌మెరుగైన ప్రదర్శనతో 37 బంతుల్లో అర్ధ శతకం చేసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్‌ ‌కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 63 బంతుల్లో 86 పరుగులు చేసి టీమ్‌కు కాస్త భరోసా ఇచ్చాడు. శార్దుల్ఠాకూర్‌.. 31 ‌బంతుల్లో 33 పరుగులు చేసి.. 211 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. అనంతరం వెనువెంటనే కుల్దీప్‌ ‌పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. టెయిల్‌ ‌బ్యాటర్లు ఆవేశ్‌ ‌ఖాన్‌ 3, ‌రవి బిష్ణోయ్‌4 ‌పరుగులు చేశారు. దీంతో టీమ్‌ ఇం‌డియా నిర్ణీత 40 ఓవర్లకు 240 పరుగులు మాత్రమే చేయగలింది. చివరివరకు శాంసన్‌ ‌క్రీజులో ఉన్నప్పటికీ.. మరో ఎండ్‌లో బ్యాటర్లు లేకపోవడం వల్ల భారత్‌ ఓటమిపాలైంది. అయితే ఆటగాళ్లలో సమన్వయం కూడా లేకపోవడంతో ఓటమి తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page