- వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
- హాత్‌సే హాత్ జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మానకొండూర్ (శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి
కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన హా ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపటిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వేలాది మంది కార్యకర్తలు ఆయనతో కలిసి నడిచారు. గ్రామగ్రామాన మహిళలు మంగళహరతులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రజలకు భరోసాను ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై విరుచకపడ్డారు. పలుమార్లు స్థానిక అంశాలను తీసుకొని కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతున్న సేపు యువకులు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు.
ఎంపీ బండి సంజయ్‌కి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో నయా జోష్ నింపింది. కొన్ని రోజులుగా నాయకులు, కార్యకర్తలు స్తబ్దతగా ఉన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో పెళ్లి అయిన నిర్వాసిత యువతులకు పరిహారం ఇవ్వకుంటే వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను వివరించారు.