తెలంగాణలో దొరల సర్కారుకు ప్రజల సర్కార్‌కు మధ్య యుద్ధం

  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ
  • కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే
  • సంగారెడ్డి విజయభేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణలో దొరల సర్కార్‌కు ప్రజల మధ్య యుద్ధం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విజయభేరీ సభకు రాహుల్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా రాహుల్‌ గాంధీ బిజెపి, బిఆర్‌ఎస్‌ ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు, మీరు తెలంగాణ ఇరిగేషన్‌ మినిస్టర్‌ , కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్‌ ఆరోపిస్తుందని అన్నారు. ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటుందని అన్నారు.

కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనన్నారు. లోక్‌సభలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ తనపై 24 కేసులు పెట్టారన్నని అన్నారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, కాంగ్రెస్‌ను ఓడిరచడానికే బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని రాహుల్‌ మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ వొచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని రాహుల్‌ విమర్శించారు.

కేసీఆర్‌ చదువుకున్న స్కూల్‌ కాంగ్రెస్‌ కట్టించిందేనని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన హైదరాబాద్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ది చేసింది. నిన్న రాత్రి తెలంగాణ యువకులతో కలిసి మాట్లాడా. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు రావడం లేదు. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి. కేసీఆర్‌ దోచుకున్న డబ్బులు ప్రజల బ్యాంక్‌ ఖాతాల్లోకి పంపిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. చాతి ముందుకు పెట్టుకుని తిరిగే వారి, కారు టైర్‌లో గాలి తీసేది కాంగ్రెస్‌ పార్టీయే’ అని రాహుల్‌ తెలిపారు. ధరణి పోర్టల్‌ నుండి లక్షల ఎకరాల భూములు లాక్కున్నారని అన్నారు. పేదల భూములు కూడా లాక్కున్నారని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌దని అన్నారు. పేపర్‌ లికులతో నిరుద్యోగులను రోడ్డుపాలు చేశారు. తెలంగాణలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చెయ్యడం లేదని తెలిపారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజా సర్కార్‌ అంటే ఏంటి ….ప్రజల సర్కారును కాంగ్రెస్‌ ఎలా పరిపాలన నచ్చిందో తాను వివరిస్తా నని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని అన్నారు. మొదట మహా లక్ష్మీ పథకాన్ని మహిళలకు అందిస్తామని తెలిపారు. 500 వందలకు గ్యాస్‌ సీలండర్‌ అందిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని అన్నారు.

ఈ మూడు పథకాల అమలుకు 5 వేల కోట్లు అకౌంట్స్‌లో వేస్తామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందిస్తామని తెలిపారు. వ్యవసాయ సాగుకు 15 వేలు అందిస్తామని అన్నారు. రోజు వారీ కూలీలకు 12 వేలు అందిస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని అన్నారు. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషన్‌ స్కూల్‌ను నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల సొమ్మును ఈ కేసీఆర్‌ దోచుకున్నాడో ఆ పైసలను రికవరీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి చేత ఆ డబ్బులను పేదల అకౌంట్‌లో వేస్తామని అన్నారు. తెలంగాణలో బిజెపి పార్టీని కాంగ్రెస్‌ ఖతం చేసిందని తెలిపారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బిజెపి ఒక్కటయ్యాయని, జీఎస్టీ, నోట్ల రద్దుపై మద్దతు చెప్పిందని అన్నారు. వీళ్ళు ఇంత అవినీతి చేస్తే ఈడి స్పందించదు..కేసులు ఉండవు అని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్‌ చేసిందని బీఆర్‌ఎస్‌ అంటుంది. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. లోకసభలో బిజెపికి బీఆర్‌ఎస్‌సిస్తది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బిజెపి మద్దతు ఇస్తదని, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచాక దిల్లీలో బీజేపీని కూడా ఒడిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ కాంప్రమైజ్‌ కాదు…ఈ రెండు పార్టీలను ఓడిరచడమే మా లక్ష్యమని అన్నారు. వీళ్ళది దొరల పాలన …మాది ప్రజల సర్కార్‌ అన్నారు. ఎంఐఎం పార్టీకి అస్సాంలో  క్యాడర్‌ లేదు ఐనా బిజెపి, ఎంఐఎం పార్టీకి నరేంద్రమోదీ మద్దతు ఇస్తాడని అన్నారు. అందుకోసమే దేశంలో నఫ్రత్‌ బజార్‌లో మోహబ్బత్‌  దుకాణం తెరిచానని అన్నారు. సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాహుల్‌ గాంధీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page