కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు అన్యాయం చేస్తూ, వివక్ష చూపడం శోచనీయమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పై చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన మాట్లాడారు. తెలంగాణలో మిని రైల్వే ప్రాజెక్ట్ ల గురించి కేసీఆర్, ప్రధాని మోడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారని అయినా ఏమి జరగలేదని సభకు దృష్టికి తీసుకెళ్లారు. కాజీపేట్- ఉట్నూర్, హైదరాబాద్-సూర్యపేట్- విజయవాడ, పెద్దపల్లి- కాజీపేట, గద్వాల్- మంచిర్యాల, భోదన్- బీదర్, జహీరాబాద్- సికింద్రాబాద్ కొత్త రైల్వే లైన్లపై రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన విజ్ఒప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే డివిజన్, కొత్త రైల్లు, కొత్త రైల్వే లైన్లు, ఆధునీకరణకు కోసం కేటాయింపులు, పాత లైన్ల ఎలక్ట్రిఫికేషన్ అంశం లేదన్నారు. మెట్రో పాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ట్రెయిన్స్ గురించి ప్రస్తావనే లేదన్నారు.
హైదరాబాద్ – ముంబై మధ్య హై స్పీడ్ ట్రైన్ ను ఇప్పటికే ప్రపోజ్ చేసినప్పటికీ, వర్క్ లో ప్రొగ్రెస్ లేదన్నారు. చర్లపల్లి స్టేషన్ లో సాటిలైట్ టెర్మినల్ అభివఈద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ లో ఉన్న రైల్వే డిగ్రీ కాలేజ్ ని రైల్వే యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలన్నారు. రైల్వే స్పోర్ట్స్ స్టేడియంను ఆధునీకరించాలని కోరారు. అలాగే, మెదక్ నియోజక వర్గానికి సంబంధించిన పలు అంశాలను సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.