Take a fresh look at your lifestyle.

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం

తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు

వైభవంగా లక్ష కుంకుమార్చన

తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 60,861 మంది భక్తులు దర్శించుకోగా 28,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తిక మహా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తిక మాసంలో టీటీడీ శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని టీటీడీ ఈవో తెలిపారు. ఇందులోభాగంగా ఈ ఏడాది కార్తీక మాసంలో యాగంటి, విశాఖపట్నం, తిరుపతిలో కార్తిక మహా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తి ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఈవో చెప్పారు.ఇదిలావుంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో లక్ష కుంకుమార్చన నను వైభవంగా నిర్వహించారు.

ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన నిర్వహంచారు. గృహస్తులు రూ.1,116 చెల్లించి టికెట్‌ ‌కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేశారు. కాగా రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్తోక్త్రగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తామని వేదపండితులు తెలిపారు.

Leave a Reply