జీవితంలో ఒక్కసారే కాలమిచ్చే
అరుదైన గౌరవాన్ని ఎదురెల్లి
అందుకునే ఆనందం .
నేరుగా ఏదో ఇవ్వాలనే
దాగాకుండా ఉండాలనే
ఇష్టమైన కోరికలో ఓ అవకాశం రూపంలో
కొద్దీ పరీక్షలాంటి ముసురులో కూడా
కనిపించని వెచ్చదనాన్ని దాచి
గుండె గుబులుకి
గుప్పెటనిండా కబుర్ల చిరుతిండ్లను
రుచిగల చూపుల్లో
నంజుకునే ఆ ప్రత్యేక సమయం
తాజా ఆకలి ఖర్చులకే…
కంటి ఇంటికి రాకుండానే
కలను కలవకుండానే
వాడిలో వేడికి రాలిన
కన్నీటి చిత్రాలకు కవితగా పొదిగి
మనసుకివ్వాలనేజి
ముచ్చట్లు మురిసేలోగే
గుచ్చుకునే మెరుపులకు
గాలికి ఊపిరాడక
నీటికి దప్పికారక
ఆకలి తప్పిన ఆశ
చీకటిని తప్పతాగి
నడిముఖంపై ఊగుతుంటె
దూరాల్ని చెరిపే ఊహ
దగ్గరకొచ్చి ఊపిరాడక
జీవానికి ప్రశ్న ఎదురై
ప్రాణాలకు దిక్కు కరువైంది.
మనిషిని నులిమిన మనసు
మాటలూరే గొంతును తెంచుకుని
చవ్వని శబ్దాలకు
అర్దాలు గువ్వలా
ఆవలి వైపుకు నెట్టబడి
చురుకైన కళ్ళలో నిప్పులుడికి
పొంతన మరచిన బంధం
పెగులుతూ కాలానికి చిక్కి
ఓ ప్రశ్నగా మిగిలి….
నడిచిన దారివెంట
గుట్టల మాటల మధ్యలో
మానులా జ్ఞాపకం దూరానికి
కొండలా కనిపించి
రోజుకో రూపంలో
మనసును పీల్చే ఇష్టంగా
ఏదో ఒక కల
ఓ మలుపు కోసం నొప్పులు పడుతుంటే
భరించని కాలం కళ్ళు ముసుకున్నా
బాధగా కళ్లు కాలాన్ని భరించలేక
ఓ నదిలా మారి
నిద్ర కోతకు గురై
రాత్రులు పగటి వేషాలకు నల్లబడి
చిక్కిన వేకువ ఎదుట
ఒక నిమిషం దక్కని వేదనకు
మనసు నిలువుగా చీలి
కనిపించని ఒక్క గుర్తుకు
కాలం ఒడిలోనే నిజం కరిగిపోయింది.
– శ్రీ సాహితి, 9704427247