Take a fresh look at your lifestyle.

తాండూరులో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్‌

  • వాట్సాప్‌ ‌గ్రూపులో పోస్ట్ ‌చేసిన ఇన్విజిలేటర్‌ ‌బందెప్ప
  • లీకేజ్‌పై పోలీసు, విద్యాశాఖ అధికారుల విచారణ
  • ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • పరీక్ష సెంటర్‌ ‌సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్‌తో పాటు మరొకరిపై వేటు
  • లీకేజీకి పాల్పడిన వారిపై సస్పెన్షన్‌ ‌వేటు….విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి
తాండూరు/వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీక్‌ అయింది. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన రోజే వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో ఎగ్జామ్స్ ‌సెంటర్లో 9 :37 గంటలకు పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం పట్టణంలోని సాయిపురం ప్రభుత్వ నెంబర్‌ ‌వన్‌ ‌పాఠశాల ఎగ్జామ్‌ ‌సెంటర్‌లో ఇన్విజిలేటర్‌ ‌విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప వాట్సాప్‌ ‌గ్రూప్‌లో పోస్ట్ ‌చేసి ఓ ప్రైవేట్‌ ‌పాఠశాల ఉపాధ్యాయునికి పంపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ ఘటన వాట్సాప్‌ ‌గ్రూప్‌లో వైరల్‌గా మారడంతో ప్రశ్న పత్రం లీకేజీ అంశం• రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసు, విద్యాశాఖ అధికారులు సీఐ రాజేందర్‌ ‌రెడ్డి, ఎంఈఓ వెంకటయ్య గౌడ్‌ ఆ ‌పాఠశాల చేరుకొని ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి ప్రశ్నపత్రం లీక్‌ అయినట్టు గుర్తించారు.
ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌ ‌మాట్లాడుతూ.. ఎగ్జామ్స్ ‌సెంటర్లో రిలీవర్గా విధులు నిర్వహిస్తున్న బందప్ప ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్‌ ‌గ్రూప్‌లో పోస్ట్ ‌చేసి బయటికి చేరవేసిన ప్రశ్నాపత్రం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లలేదని, అలాగే ఏ విద్యా సంస్థకు చేరలేదని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రం వైరల్‌ అవుతున్న విషయాన్ని నిమిషాల వ్యవధిలో పోలీసులకు చేరడం, వెంటనే స్పందించడంతో ఆ ప్రశ్నాపత్రం ఎవరిచేతుల్లోనూ పడలేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారికి అందజేయనన్నట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఉపాధ్యాయుడు బందేపను అదుపులోకి తీసుకున్నారు.
విచారణ చేపట్టిన పోలీసు, విద్యాశాఖ అధికారులు
విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజేందర్‌ ‌రెడ్డి, ఎంఈఓ వెంకటయ్య గౌడ్‌లు వెంటనే పాఠశాలకు చేరుకుని వాట్సాప్‌లో క్వషన్‌ ‌పేపర్‌ను పంపిన బందెయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్‌ ‌ఫోన్‌ ‌స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. అనంతరం తాండూరు తహసీల్దార్‌ ‌చిన్నప్పల నాయుడు సమక్షంలో విచారణ జరిపారు. ఈ విచారణలో బందెయ్య ఫోన్‌ ‌నుంచే క్వశ్చన్‌ ‌పేపర్‌ ‌బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు, అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు.
వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‌ద్వారా ప్రశ్నా పత్రం లీకేజ్‌ : ‌మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌
‌పదో తరగతి క్వశ్చన్‌ ‌పేపర్‌ ఎలా ప్రత్యక్షమయ్యిందనే దానిపై ఎంఈఓ వెంకటయ్య గౌడ్‌ ‌వివరణ ఇచ్చారు. నిజానికి పరీక్ష కేంద్రాలకు సెల్‌ ‌ఫోన్లు అనుమతించలేదని తెలిపారు. కాని బందెయ్య సెల్‌ ‌ఫోన్‌ ‌తెచ్చినా పరీక్ష పర్యవేక్షణ అధికారికి ఇవ్వలేదన్నారు. ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది హాజరు కావాల్సి ఉండగా 258 మంది పరీక్షలు రాశారని తెలిపారు. గైర్హాజరు అయిన విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నా పత్రం తీసుకుని వాట్సాప్‌లో పంపడం జరిగిందని, దీంతో ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందన్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి, డీఈఓ రేణుకా దేవిలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు పోలీసులు పట్టణ సీఐ రాజేందర్‌ ‌రెడ్డి సమక్షంలో టీచర్‌ ‌బందెప్పను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు.
గతంలోనూ ఉపాధ్యాయునిపై పోక్సో కేసు
పదోతరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్‌లో ఉంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్పపై గత 2017 సంవత్సరంలో పోక్సో చట్టం కింద  కేసు నమోదైంది. ఆయన పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థినిని వేధించడంతో అప్పుడు కేసు నమోదు చేశారు.
లీకేజీకి పాల్పడిన వారిపై సస్పెన్షన్‌ ‌వేటు….విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి
పదవ తరగతి పరీక్షల్లో భాగంగా తాండూర్‌ ‌నెంబర్‌ ‌వన్‌ ‌పాఠశాలల్లో జరిగిన పేపర్‌ ‌లీకేజీకి పాల్పడిన వారిపై సస్పెన్షన్‌ ‌వేటు వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి తెలిపారు. పదవ తరగతి పరీక్షా లీకేజ్‌పై సోమవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌రాహుల్‌ ‌శర్మ, డిఇఓ రేణుక దేవితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి మాట్లాడుతూ…పరీక్ష ప్రారంభమైన తర్వాత 9:37కు గైరాజరైన విద్యార్థి యొక్క పేపర్‌ను ఫోటో తీసి ఇద్దరు టీచర్లు బందప్ప, సామ్మప్ప వాట్సాప్‌ ‌ద్వారా బయటికి పంపినట్లు గుర్తించడం జరిగిందని కలెక్టర్‌ ‌తెలిపారు. క్వశ్చన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో శివకుమార్‌, ‌గోపాల్‌, ‌బందప్ప, సమ్మప్పలను సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌తెలిపారు. బందప్ప, సమ్మప్పలపై క్రిమినల్‌ ‌కేసు నమోదు చేయనున్నట్లు, శ్రీనివాస్‌ను పరీక్ష ఇన్విజీలేటర్‌ ‌నుండి తప్పించనున్నట్లు కలెక్టర్‌ ‌వెల్లడించారు. మొత్తం వ్యవహారంలో ఐదుగురిపై చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్‌ ‌తెలిపారు.
యథావిధిగా ఈ పేపర్‌ ‌కౌంటింగ్‌ ‌చేయడం జరుగుతుందని, ఇకముందు పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలపై ఎలాంటి అపోహలు పెట్టుకొవొద్దని, ఆందోళన చెందవద్దని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ ‌భరోపా ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత లీకేజ్‌ అయ్యింది కాబట్టి పరీక్షను రద్దు చేయడం లేదని యథావిధిగా పరీక్షను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇకముందు విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా…ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి సూచించారు.

Leave a Reply