Take a fresh look at your lifestyle.

డెత్‌ ‌బెడ్‌పై డెమక్రసీ

పరిహాసం ప్రజాస్వామ్యం
డెత్‌ ‌బెడ్‌పై సమన్యాయం
డెమక్రసీ హైజాక్‌ ‌ఖాయం
హాక్‌ అవుతున్న అధికారం
బోనులో శాంతి పావురం !

బంధీ అయ్యింది సుస్వరాజ్యం
నీతి నియమాలే బహుపూజ్యం
అధికారమే దోపిడీ మహాద్వారం
అతలాకుతలం మానవత్వం
సైబర్‌ ‌తెరలే అక్రమాదాయం !

బంధుప్రీతికే పట్టాభిషేకాలు
డుబ్బులకే సకల నాటకాలు
ఉన్నోళ్లవే రాక్షస రాజ్యాలు
దొడ్డోళ్లకే అవినీతి ఫలాలు
కుబేరులకే లక్ష్మి ప్రసన్నాలు !

పేదోడికే మెతుకు దూరాలు
బక్కోళ్లకే బతుకు భారాలు
కంచంలో కారం ముద్దలు
బడుగులకే ఆకలి రోగాలు
బోనులో సమన్యాయాలు !

రాజ్యాంగ కత్తులు నూరి..
అక్రమాల కలుపు మ్నెక్కల్ని..
న్యాయదేవత సాక్షిగా నరికి..
పౌరసమాజ ప్రగతి కాంక్షించి..
ఆకలి రోగాన్ని చేద్దాం అంతం !

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగరం – 9949700037

Leave a Reply