పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఏం ఫార్మసీ, విద్యార్థులు మంగళవారం హైదరాబాదులోని టీ- హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. హేమై ఈ పర్యటనను సమన్వయంగా చేయగా డాక్టర్ పవన్ కుమార్ సహకరించారు. ఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు టీ- హాబ్ లో పరిశ్రమలుతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. టీ హబ్ ఈవెంట్స్ టీమ్ కే. వినయ్ సౌకర్యాల ఉపాధ్యక్షుడు మోటివేషనల్ స్పీకర్ టి శ్రీనివాసులు ఆ సంస్థ స్థాపనతో పాటు దాని కార్యకరిపాల గురించి వివరించారు. టీ- హబ్ స్థాపనలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. టి. రామారావు ముందుచూపు క్రియాశీల పాత్రను వారు తెలియజేశారు. టీ హబ్ దన్నుతో వ్యవస్థాపన కూల్ గా ఎదిగిన వారికి కూడా గీతం విద్యార్థులు కలిసి విషయ సేకరణ చేశారు. వారి ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చి మార్కెట్లో విజయవంతం ప్రవేశించాయో తెలుసుకున్నారు. నిజ జీవిత గాథలు ఔ త్సహిక ఫార్మ సిస్టులలో ప్రేరణ నింపయనడంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంలో టీ-హబ్ సౌకర్యాలు, పని ప్రదేశాలను చూడడమే గాక, స్టార్టప్ లు, యువ పారిశ్రామికవేత్తల అంకితభావం, ఆవిష్కరణను నేరుగా చూడటం వల్ల గీతం విద్యార్థుల్లో వ్యవస్థాపకత, ఆవిష్కరణల పట్ల మక్కవను మరింత పెంచింది.ఈ పర్యటనను విజయవంతం చేయడానికి సహకరించి శ్రీనివాసరావు మహంకాళికి డాక్టర్ హేమై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్శనలో తమ విద్యార్థులకు ఒకసుసంపన్నమైన అనుభవం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతల గురించి తెలుసుకోవడానికి తోడ్పడిందన్నారు. తరువాతి తరం వినూత్న ఫార్మసిస్టులను పెంపొందించడంలో ఈ పర్యటన తమ నిబద్ధతను మరింత బలోపేతం చేసినట్లు ఆమె చెప్పారు.