టిఆర్‌ఎస్‌ ‌మాఫియా గ్యాంగ్‌..!

  • కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
  • అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 22 : ‌కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి హైద్రాబాద్‌ ‌నుండి ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెడుతూ రౌడి షీట్లు ఓపెన్‌ ‌చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేష్‌ను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులతో పాటు రౌడి షీట్లు ఓపెన్‌ ‌చేసి, వారి కుటుంబంపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

సాయి గణేష్‌ ఆత్యహత్య ప్రయత్నం చేయడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. సాయి గణేష్‌ ‌దగ్గర పోలీసులు మరణ వాగ్మూలంను స్వీకరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి సాయి గణేష్‌ ‌సంఘటన ఒక ఉదాహరణ అని తెలిపారు. టిఆర్‌ఎస్‌ ‌నాయకులు భూమి, లిక్కర్‌, ‌ధాన్యం, బియ్యం మాఫియాలుగా తయారయి దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఇష్టనుసారంగా మాట్లాడుతున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నిస్తే కేసులతో పాటు రౌడీ షీట్లు ఓపెన్‌ ‌చేస్తున్నారన్నారు.

గ్రామ పంచాయితీకి కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఎన్ని ఇచ్చారో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌చర్చకు రావాలని సవాల్‌ ‌విసిరారు.  తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసిఆర్‌ ‌వల్ల రాలేదని 12 వందల మంది బలిదానం, సకల జనుల సమ్మె, అన్ని సంఘాలు కలిస్తేనే బిజెపి పోరాటం చేస్తేనే తెలంగాణ వొచ్చిందన్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌ అరాచక పాలనకు సయమం దగ్గర పడిందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి 2 సార్లు అవకాశం కల్పించారని అదే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా ఇంటికి పంపడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. 12వందల బలిధనం చేస్తే వారి కుటుంబాలను టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోలేదని తెలిపారు.

పంజాబ్‌ ‌రాష్ట్రంలో 700మంది రైతులు చనిపోయినట్లుగా లెక్కలు ఉన్నాయని చెప్పి వారిని ఆదుకుంటానని కేసిఆర్‌ ‌చెప్పడం సంతోషమే కాని తెలంగాణ కోసం అమరులైన 12 వందల మందిని 8 సంవత్సరాలు అయిన వారి పైపు చూసిన పాపాన పోలేదని విమర్శించారు. 8 సంవత్సరాల టిఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్ర అభివృద్ధి పెద్దగా జరిగింది ఏమి లేదని, అప్పుల రాష్ట్రంగా కేసిఆర్‌ ‌మార్చారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేక సర్వేలు వొస్తుండడంతో తండ్రి, కొడుకులకు నిద్ర పట్టడం లేదన్నారు. హుజూరాబాద్‌ ‌ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వొస్తాయని జోస్యం చెప్పారు. కేసిఆర్‌ ‌నియంత, నిజాం పాలనను తరిమి కొడుతారని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే పాలన అందించేందుకు బిజెపి తీసుకువస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా బిజెపి పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు, జాతీయ నాయకులు వివేక్‌ ‌వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, కడియం రామచంద్రయ్య, సంకినేని వరుణ్‌రావు, పల్సా మల్సూర్‌ ‌గౌడ్‌, ‌రాపర్తి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కార్తీక్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా నాయకలు పోలగాని ధనుంజయ గౌడ్‌తో పాటు ఆయన అనుచరులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *