నోయిడా,ఆగస్ట్29: సూపర్‌టెక్ జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి మనకు చేరకుండా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఈ శిథిలాలను తొలగించడానికి మూడు నెలల కాలం పట్టవచ్చని అంటున్నారు. కూల్చివేత వల్ల దాదాపు 55 వేల టన్నుల వ్యర్థాలు పోగుపడ్డాయి. భవన శిథిలాల్లో దాదాపు నాలుగు వేల టన్నుల ఉక్కు ఉంటుందని అంచనా. దీన్ని అక్కడి నుంచి తొలగించడానికి మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. భవనాలు కూలిన వెంటనే గాల్లోకి దుమ్ము మేఘాలు లేచాయి. ఆ ప్రాంతమంతా కాసేపు బూడిద రంగులోకి మారింది. ఎలాంటి గాలులు, వర్షాలు లేకపోయిన్లటైతే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో వుండే ధూళి అత్యంత ప్రమాద కరమని హెచ్చరించారు. ఇకపోతే సూపర్‌టెక్ జంట భవనాల కూల్చివేత వెనుక నలుగురు వృద్ధులు దశాబ్దానికి పైగా చేసిన న్యాయపోరాటం ఉంది. సూపర్‌టెక్, అపెక్స్, సియానే సంస్థలపై 2009లో మొదలైన వారి యుద్ధం ఎట్టకేలకు ఆదివారం విజయంతో ముగిసింది.
ఆ నలుగురే యూబీఎస్ తెవతియా(80), ఎస్కే శర్మ(74), రవి బజాజ్(65), ఎంకే జైన్(59). సూపర్‌టెక్ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తోందని మొదట గొంతెత్తింది, పోరాడింది వీరే. తెవతియా 2010లో సొసైటీలోకి వచ్చారు. ఆ ఏడాది పునాదులు వర్షపు నీటితో నిండిపోవడంతో తొలిసారిగా ఆయన మరికొంతమందితో కలిసి అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. అనంతరం బిల్డర్లకు, నోయిడా అధికారులకు, పోలీసులకు వరసగా జంట భవనాల గురించి ఫిర్యాదులు చేసినా లాభం లేకపోయింది. ఆఖరికి మంత్రి అజాం ఖాన్‌ను సంప్రదించినా దిక్కులేని పరిస్థితి. చివరిగా.. 2012లో అలహాబాద్ హైకోర్టును ఆ నలుగురు ఆశ్రయించారు. రెండేళ్ల అనంతరం కోర్టు వారికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.
టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. అయితే.. బిల్డర్ ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో, అత్యున్నత న్యాయస్థానం లోనూ ఆ నలుగురూ పోరాటం సాగించి, ఎట్టకేలకు విజయాన్ని సాధించారు. సెక్టార్93ఎ లోని అపెక్స్ జంటటవర్లను పోలీసుల నుంచి క్లియరెన్స్ రాగానే అధికారులు, ఇంజినీర్లు ట నొక్కి నియంత్రిత పేలుళ్ల ద్వారా మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేశారు. ఈ జంట టవర్ల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. పేలుడు పదార్థాలను అమర్చేందుకు భవనాల పిల్లర్లలో 7000 రంధ్రాలు చేశారు. 20,000 సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. 100 టర్ల నుంచి ట నొక్కగానే భవనాలు నిలువుగా కుప్పకూలేలా పిల్లర్లు పేలిపోయాయి. దీనినే ’వాటర్‌ఫాల్ టెక్నిక్’ అని పిలుస్తారు. ముంబయికి చెందిన ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ కలిసి ఈ పని చేపట్టాయి. పేలుడుకు 9 సెకన్లు పట్టింది. తర్వాత నాలుగైదు సెకన్లలో భవనాలు కూలిపోయాయి. రూ.70 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవనాలను రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరీ కూల్చారు.



