జీవ నదులు ఉన్నా నీటి వనరులను ఏ ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం

రాష్ట్రాల మధ్య కొట్లాటలు
తాగునీటి సమస్యలపై దృష్టి లేని కేంద్ర పాలకులు
ప్లీనరీ వేదికగా సిఎం కెసిఆర్‌ ‌ఘాటు విమర్శలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఈ ‌దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా..రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ‌దేశంలోని నీటి వనరులపై ప్రసంగించారు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉన్న నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని కేసీఆర్‌ ‌తెలిపారు. మరో నాలుగైదు టీఎంసీల లెక్క తేలాల్సి ఉంది. ఇది అంతర్జాతీయ గొడవల్లో ఉంది. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుల ద్వారా 29 వేల టీఎంసీలు మాత్రమే దేశం వాడుకుంటుంది.

దేశంలో ఎక్కడా చూసిన నీటి యుద్దాలే. దీనికి కారణం ఎవరు. 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జలాల కోసం తమిళనాడు, కర్ణాటక మధ్య యుద్ధం, సింధూ, సట్లెజ్‌ ‌జలాల కోసం రాజస్థాన్‌-‌హర్యానా మధ్య యుద్ధం ఏర్పడిందన్నారు. నీసం తాగునీళ్లకు కూడా ఈ దేశం నోచుకోవడం లేదని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలున్నాయి. కరెంట్‌ ‌కోతలున్నాయి.

మాటలు చెప్తే మైకులు హోరెత్తుతున్నాయి. వాగ్దానాల హోరు.. పనిలో జీరో. మౌలిక వసతులు లేవు అని కేంద్రాన్ని విమర్శించారు. మట్టి, నీళ్లు లేని సింగపూర్‌ ఆర్థిక పరిస్థితిలో నంబర్‌ ‌వన్‌లో ఉందన్నారు. మంచినీళ్లు కూడా మలేషియా నుంచి కొంటారు. అన్నం ముద్ద కూడా వారిది కాదు. ఆ దేశంలో ఏమి లేదు.. కానీ ఆర్థిక స్థితిలో నంబర్‌ ‌వన్‌గా ఉంది. మన దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదు. ఇది కఠోరమైన వాస్తవం..నిప్పులాంటి నిజం అని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *