జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

  • కుడా ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో ఎమ్మెస్‌ 80 ‌రద్దు చేయాలని డిమాండ్‌
  • ‌టిఆర్‌ఎస్‌ ‌మినహా పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నేతలు

సుబేదారి, మే 25(ప్రజాతంత్ర విలేఖరి) : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్‌ ‌పూలింగ్‌(‌భూ సమీకరణ) స్కీమ్‌కు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి నస్కల్‌(‌కరుణాపురం) వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి మూడు గంటల పాటు ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల భూములు తీసుకోవాలని చేపడుతున్న ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కెసిఆర్‌కు, కేటీఆర్‌కు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, ‌చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో, ఎడ్లబండిలో తరలివచ్చి రోడ్లకు ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను అడ్డంగా పెట్టి దిగ్బంధించి ధర్నా చేశారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా కార్యక్రమం కొనసాగింది. ట్రాఫిక్‌ ఇరువైపుల మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలలో పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున రైతులు ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీల కతీతంగా ధర్నా కార్యక్రమాలు, జాతీయ రహదారి దిగ్బంధం జరిగింది. ఈ సందర్భంగా రైతుల జేఏసీ కన్వీనర్‌ ‌దేశినేని హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌పేరుతో రైతుల భూములను లాక్కోవడానికి ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో ఎమ్మెస్‌ 80  ‌రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే భూ సేకరణ విధానాన్ని రైతులు ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా లేరని ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని 27 గ్రామాల రైతులు ఉన్నారని దీని ద్వారా లక్ష మంది నిరాశ్రయులయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అధికారులు వొచ్చి జీవోను రద్దు చేస్తున్నామని చెప్పేంత వరకు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. సుమారు మూడు గంటల సేపు జాతీయ రహదారి దిగ్బంధం అయిన తరువాత ఎక్కడి వాహనాలు అక్కడే  కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌స్తంభించడంతో పోలీసులు చేసేదిలేక ఉన్నతాధికారులకు వాస్తవ ధర్నాను తెలియజేశారు. జనగామ జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వొచ్చి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇది నీకు సంబంధం లేని విషయం, కుడా వైస్‌ ‌చైర్మన్‌ ‌వచ్చి జీవోను రద్దు చేస్తున్నామని చెప్పాలని రైతులు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు.

జనగామ జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌జీవో రద్దు విషయంలో ఆలోచన చేపడతామని ప్రస్తుతం ధర్నా విరమించాలని రైతులను కోరినప్పటికీ మహిళలు, రైతులు జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌విన్నపాన్ని తోసిపుచ్చారు. చేసేదిలేక పోలీసులు, జనగామ జిల్లా కలెక్టర్‌ ‌మిన్నకుండిపోయారు. పోలీసులు పలు సార్లు అరెస్టులు చేసే విధంగా వాహనాలు వాహనాలు తెప్పించి అరెస్టు చేస్తామని రైతుల వద్దకు రాగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కెసిఆర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌, ‌కేటీఆర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌, ‌స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ‌చల్ల ధర్మారెడ్డి ధర్మారెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టి దహనం చేశారు. దిష్టి బొమ్మను తగల బెట్టకుండ పోలీసులు అడ్డుకున్న ప్పటికీ పోలీసుల చేతినుండి బొమ్మను గుంజుకొని తగులబెట్టారు.

రైతుల జాతీయ రహదారి దిగ్బంధం  ఈ ధర్నా ఆందోళన కార్యక్రమంలో బిజెపి హనుమకొండ అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి అధికార ప్రతినిధి రాకేష్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ మంత్రి డాక్టర్‌ ‌విజయ రామారావు, కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, అదేవిధంగా సిపిఎం నాయకులు ధర్నా రైతుల ధర్నా కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి మూడు గంటల పాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వరంగల్‌ ‌జిల్లా రైతులను మోసం చేసి భూమికి ఉంచుకోవాలని చేస్తున్న ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్‌ ‌హనుమకొండ జనగామ జిల్లాల రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఆందోళన కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు రవీందర్‌ ‌రెడ్డి, యాకూబ్‌, ‌శ్రావణ్‌ ‌రెడ్డితో పాటు 27 గ్రామాల నుండి వచ్చిన వేలాది మంది రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *