ఏపీ హైకోర్టుకు శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. 17న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎందుకు క్రీడాకారులను ఎంపిక చేయలేదని హైకోర్టు శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించింది.
సెలక్షన్ తన పరిధిలోనిది కాదని శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రెండు జట్ల మధ్య విభేదాలు ఉన్నాయని శాప్ ఎండీ పేర్కొన్నారు. యలమంచిలి శ్రీకాంత్, వీర్ల లంకయ్య టీమ్స్ నుంచి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.