Take a fresh look at your lifestyle.

జర్మన్‌ ‌రాయబారి కార్యాలయంలో ‘నాటు నాటు’ వేడుక

జరుపుకోవంపై ప్రధాన మంత్రి ప్రశంస
హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : భారతదేశానికి, భూటాన్‌కు జర్మనీ తరఫు రాయబారి ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌శేర్‌ ‌చేసిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియోలో డాక్టర్‌ ‌ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌మరియు రాయబారి కార్యాలయ సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారాన్ని సాధించడాన్ని హర్షిస్తూ, చిందులు వేయడం, ఆ వీడియోను పాత దిల్లీ నగరంలో చిత్రీకరించడం జరిగింది.

ఇంతకు మునుపు ఫిబ్రవరి నెలలో, భారతదేశం లోని కొరియా రాయబారి కార్యాలయం కూడా ఈ పాటకు ప్రశంస గానా అన్నట్లు సంబురాన్ని జరుపుకుని ఒక వీడియో రూపంలో సమర్పించింది. ఈ సందర్భంగా జర్మనీ రాయబారి ట్వీట్‌కు ప్రధాన మంత్రి సమాధానం ఇస్తూ..‘‘భారతదేశం యొక్క రంగులు మరియు రుచులు ! జర్మన్‌ ‌దేశస్తులు చాలా చక్కగా ఆడి పాడగలరురు. అందులో సందేహం లేదు.’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply