‘సోషల్ రేవేల్యూషనర్
ఈక్వల్ సొసైటీ డ్రీమర్
పొలిటికల్ కింగ్ మేకర్
బెస్ట్ పార్లమెంటీరియన్
తానే దీనజన బాంధవ్
‘బాబూజీ’ జగ్జీవన్ రామ్
నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద
నిరసన గళమెత్తిన వీరుడు
సామాజిక కట్టుబాట్ల మీద
రణం ప్రకటించిన యోధుడు
స్వేచ్చా స్వాతంత్రం కోసం
సమరం సాగించిన ధీరుడు
హరిత విప్లవోద్యమాలకు
దన్నుగా నిలిచిన సేనుడు
దీనుల అభ్యున్నతి కోసం
జీవితం అర్పించిన త్యాగి
సమాజ జాగృతి కోసం
అలుపెరుగక శ్రమించిన
నవయుగ దార్శనికుడు
భారతదేశ ఉప ప్రధానిగా
తొలి కార్మికశాఖ మంత్రిగా
విశిష్ఠాత్మక సేవలందించి
వినతికెక్కిన విఖ్యాతుడు
విలువలు వీడని గుణం
మాటకు కట్టుబడే తత్వం
మడమ తిప్పని ధీరత్వం
ఆ మహాత్మునికే స్వంతం
భావితరాల మార్గదర్శి
బాబు జగ్జీవన్ రాంజీకి
బహుజన జయ హారతి
భరతజాతి వినమ్ర ప్రణతి
(ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493