చేయూత, మహాలక్ష్మి పథకాలకు సిఎం శ్రీకారం

నేటి నుంచి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు
మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఇక ఉచిత ప్రయాణం
అసెంబ్లీ ఆవరణలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటెమ్‌ స్పీకర్‌, డిప్యూటీ సిఎం, మంత్రులు, సిఎస్‌, తదితరులు
బాక్సర్ నిఖత్‌ జరీన్‌కు ప్రభుత్వం నుంచి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం
ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతాం…గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : శనివారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా రెండు గ్యారంటీలను అధికారంలోకి వొచ్చిన 3వ రోజే శ్రీకారం చుట్టారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను మంత్రులు, ప్రొటెమ్‌ స్పీకర్‌, శాసన సభ్యులు, సిఎస్‌, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం రేవంత్‌ డిప్యూటీ సిఎం భట్టితో కలిసి ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక నుంచి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం సీఎం రేవంత్‌ ప్రారంభించారు. అనంతరం సిఎం, మహిళా మంత్రులు, ఇతర మంత్రులు సహా అందరూ బస్సులో నేరుగా ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీసం పడ్డ రోసు కావడమే కాకుండా కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు ఈ పథకాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా వరల్డ్‌ ఛాంపియన్‌, కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్‌ను రేవంత్‌ అందించారు.

ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతాం…గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీభవన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. రవాణా శాఖమంత్రిగా తొలి కార్యక్రమం తనతో ప్రారంభమవుతున్నదని ఆయన వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page