- గంటసేపు ధర్నా చేయలేని మీరు దేశాన్ని పాలిస్తారా?
- వడ్లు ప్రతీ గింజా కొనే వరకూ సీఎంను వదలం
- మోదీని గద్దె దింపే దమ్ము కేసీఆర్‌కు లేదు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రజాతంత్ర , హైదరాబాద్ :
సీఎం కేసీఆర్‌కు చేతనైతే రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాలానీ, లేదంటే గద్దె దిగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రగల్భాలు పలికి గంట సేపు కూడా కూర్చోలేని మీరు దేశాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో కాదు గల్లీలో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరావరు. సోమవారం ఇందిరా పార్కు వద్ద చేతనైతే గద్దె దిగు, లేదంటే వడ్లు కొను డిమాండ్‌తో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వడ్ల దందాతో రూ.కోట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ధాన్యం కొనేది బరాబర్ కేంద్రమేననీ వడ్లు సేకరించి ఇచ్చే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. వద్దన్నా రైతులను వరి వేయమని చెప్పి ఇప్పుడు నెపాన్ని కేంద్రం మీద నెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతుల చేసిన తప్పేంది ? నువ్వు చసిన తప్పులకు రైతులు బలికావాల్నా అని నిలదీశారు.
కేసీఆర్‌ను ఫాం హౌస్‌కు గుంజుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు సింహాలై గర్జిస్తున్నదరనీ, బీజేపీ నేతలను కుక్కలంటూ సంబోధించిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కుక్కలో కూడా మల్లన్నను చూసుకునే సంస్కతి బీజేపీదనీ, సింహాలై గర్జిస్తున్న కార్యకర్తలు బీజేపీ సొంతమని పేర్కొన్నారు. గత ఏడు ఏళ్లుగా వడ్లు కొనుగోలు చేస్తున్మామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం అదే పని ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష చేస్తానన్న సీఎం కేసీఆర్ గంట సేపు కూడా దీక్షలో కూర్చోలేక పోయారని ఇక దేశాన్ని ఏం పాలిస్తారని ఎద్దెవా చేశారు. కేటీఆర్ సీఎం సీటు కోసం డాడీ డాడీ అని అరుస్తుంటే కేసీఆర్ మాత్రం ఆయన బాధ పడలేక ప్యాడీ ప్యాడీ అంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులను రాజును చేస్తామన్న మోదీ ఎక్కడ రైతులను వంచించి మోసం చేసిన కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారనీ, వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్బంగా బండి సంజయ్ హెచ్చరించారు.