- ప్రతి పిల్లవాడు చదువుకుని తనకాళ్లపై తాను నిలబడాలి
- అందుకే తల్లుల ఖాతాల్లో ఠంచన్‌గా డబ్బులు జమచేస్తున్నాం
- విద్యావ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకు వెళుతున్నాం
- తిరుపతి విద్‌ఆయదీవెన సభలో సిఎం జగన్ ఉద్ఘాటన
- చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదన్న మంత్రి రోజా
తిరుపతి, మే 5 : చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను.. అంతెందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చదవువు కోసం డబ్బులు లేక ఎవరూ ఇబ్బంది పడరాదన్నదే తమ లక్ష్యమని కూడా అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చేసే శక్తి చదువుకు ఉందని నమ్మే వ్యక్తిని నేను. 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరడం సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చింది. పాదయాత్ర లో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడ దనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ది చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చాం అని సీఎం జగన్ అన్నారు. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకోర ఫీజులతో, రీయంబర్స్‌మెం ట్‌లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే.. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో రే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్ కోరారు.
అంతేకాదు గతంలోని ప్రభుత్వం.. ఇప్పుడున్న పథకాల్లాంటివి ఏమైనా ప్రవేశపెట్టిందా? అని సీఎం జగన్ అడిగారు. అంతకుముందు సభలో మంత్రి రోజా మాట్లాడుతూ ..విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ కార్య ్రకమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఏకిపారేశారామె. ప్రతీ పేద విద్యార్థి తాను కలలు గన్న చదువు అందుకుని.. ఆ కుటుంబాన్ని పైకి తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చినా జగనన్నకు కృతజ్ఞతలు. ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యాదీవెన. పేదోడంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదు. అందుకే అన్నిరకాలుగా నరకయాతన పెట్టాడు.
కానీ, మనసున్న మహరాజు జగనన్న ముఖ్య మంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతీరోజూ సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి విద్యార్థుల అదృష్టం.. జగనన్న ముఖ్య మంత్రిగా ఉండడం అని మంత్రి రోజా అన్నారు. అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువు అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకు అండగా ఉన్న జగనన్న.. ఈ ప్రశంసలేవీ చంద్రబాబుకు సహించడం లేదు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబే. అందుకే ఇవాళ సిగ్గులేకుండా బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం మొదలు• •ట్టాడు. కానీ, సీఎం జగన్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వయసు తేడా లేకుండా.. కుల, వర్గాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేస్తున్న తెలుగు దేశం పార్టీని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బాది పంపించారు. వాళ్ల వ్యవహారం ఇలాగే కొనసాగితే.. 2024 లోనూ చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదని సీఎం రోజా చెప్పారు. అవినీతికి తావు లేకుండా పాలిస్తున్న సీఎం జగన్.. .మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం ఈరోజు రాష్ట్రం కోసం పిల్లల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలనుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.