72 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఎ సోదాలు
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 21 : గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందందూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, గుజరాత్,మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ అధికారులు ముమ్మర సోదాలు సాగాయి. అక్రమ ఆయుధాల వ్యాపారులు,గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
అనేక మంది ఇళ్లలో అక్రమంగా ఆయుధాలు ఉన్నాయన్నమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఫిలిబిత్ కేంద్రంగా అక్రమంగా ఆయుధాలను గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారని ఎన్‌ఐఏ సోదాల్లో తేలింది. అక్రమ ఆయుధాలు పాకిస్థాన్ దేశం నుంచి వచ్చాయని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ , నీరజ్ బవానా లకు చెందిన ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు.. వారిని ప్రశ్నిస్తున్నారు.