హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కొల్లాపూర్ నియోజవర్గంలోని గెమ్యా తండాను గ్రామ పంచాయతీగా చేసే విధంగా జీవో విడుదల చేయ్యాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్, కొల్లాపూర్ ఇన్‌చార్జ్ శివనాయక్ సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రజావాణిలో మెమొరాండం ఇచ్చామన్నారు. అదేవిదంగా సిఎం రేవంత్ రెడ్డి ఈ తండాను దత్తత తీసుకోవాలని వారు కోరారు. శివ నాయక్ తో కలసి షేక్ జలీల్ మాట్లాడుతూ గెమ్యా తండాలో తాగటానికి నీరు, ప్రభుత్వ దవాఖాన లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తండాను ఖాళీ చేసి బస్తీలకు వలస వచ్చారన్నారు. గ్రామంలో జీవనధారం లేక హైదరాబాద్ బస్తీలో జీవనోపాధి లేక అక్కడ ఉండలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 సం.లుగా సాగులో ఉన్న పట్టా భూములను గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రైతులు ఆకలికేకలతో సతమతం అవుతున్నారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణరావు ఆ తండాలో ఉన్న భూములను కాపాడాలన్నారు. ఆ గ్రామం నుండి 1 కిలో మీటరు దూరంలో ఉన్న కృష్ణ నది జలాలను తాగటానికి నీరు అందించి వ్యవసాయానికి సాగు నీరు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ బాబర్ షేక్, సయ్యద్ సైదా పాల్గొన్నారు.
గెమ్యా తండాను గ్రామ పంచాయతీగా మర్చాలి
