Take a fresh look at your lifestyle.

గురు దక్షిణ

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి ఆవేశంగా రణరంగంలో తలపడింది. ద్రుపదుడు ఎదురువచ్చిన వారినంతా పరాభూతులను గావిస్తూ విజయవిహారం గావించాడు. కర్ణుని మూర్చబోయేలా అంగసంధులలో  తాండవం చేశాడు. కౌరవులు వెనుదిరిగిపోయారు.

అర్జునుడికి తెలుసు ద్రుపదుని పరాక్రమము. ద్రోణుడితో సమంగా శస్త్రాస్త్ర విద్యను నేర్చుకున్న ద్రుపదుని దుర్యోధనాదులు జయించలేరు గావున, వారు వెనుతిరిగిన తరువాతనే తాను రంగప్రవేశం గావించాలని నిరీక్షించాడు. ఎప్పుడైతే కౌరవులు వెనుతిరిగారో అప్పుడు అర్జునుడు, ధర్మరాజును  ఆచార్యుల వద్దనే వుండమని చెప్పి, నకుల సహదేవులను అంగరక్షకులుగా తీసుకుని ద్రుపదుని సేనా వాహినిపై విజృంభించాడు . భీముడు గజబలాన్ని చిందరవందరగావించాడు,.. అర్జునుడికి అడ్డుగా ద్రుపదుని సోదరుడు వచ్చాడు. వారిద్దరూ తీవ్రంగా యుద్ధం చేశారు. భీముడు నగరాన్నీ, ద్రుపదుని సేననూ నాశనం గావించే ప్రయత్నంలో వుండగా అర్జునుడు వారించాడు. పాంచాల రాజులు మన బంధువులే కదా అంటూ ద్రుపదుని మాత్రం బంధించి ద్రోణుడివద్దకు  కట్టితెచ్చి పడవేశాడు. ద్రోణుడు దయతలచి, గంగకు దక్షిణభాగాన్ని ద్రుపదున్నిఏలుకోమన్నాడు. ఉత్తర భాగాన్ని అహిఛత్రం రాజధానిగా ఏలుబడి చేయించాడు ద్రోణుడు. ఛర్మణ్వతీనదికి దక్షిణానవున్న కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ద్రుపదుడు పాలించాడు ఆ తర్వాత..             (మిగతా..వొచ్చేవారం)

Leave a Reply