గుండెపోటుతో కుప్పకూలుతున్న జనం

  • ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు  
  • పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ‌నేత, బాపట్లలో టీచర్‌ ‌మృతి
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు,ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. స్నేహితులతో సరదాగా ముచ్చట్లు పెడుతున్న విశాల్‌ ‌సడన్‌గా కిందపడిపోయాడు. దీంతో తోటివారు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. గతవారం బోయిన్‌పల్లిలో ఓ కానిస్టేబుల్‌ ‌జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా సడన్‌గా కూలబడిపోయాడు. తోటివారు వచ్చేలోపు ఆయన గుండె ఆగిపోయింది. తాజాగా పెద్దపల్లి  జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్‌ ‌తమ్ముడు శైలేందర్‌ ‌సింగ్‌ ఉన్నట్టుండి గుండెపోటుతో మృతిచెందారు. గోదావరిఖనికి  చెందిన శైలేందర్‌సింగ్‌ ‌రోజూలానే శుక్రవారం తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కార్డియాక్‌ అరెస్టుతో కుప్పకూలిపోయారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న శైలేందర్‌.. ‌తలుపునకు తాళం వేసి.. నాలుగు అడుగులు వేశారు.
ఈ క్రమంలో గుండె నొప్పిరావడంతో పక్కనేఉన్న గోడను పట్టుకుని కిందపడిపోయారు. క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలారు. ఇదంతా శైలేందర్‌ ఇం‌టిబయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.ఇక మరో ఘటనలో శనివారం ఉదయం బాపట్ల జిల్లా చీరాల మండలం వాకావారిపాలెంలో జరిగిన ఘటన షాక్‌కు గురి చేసింది. ఉదయం యథావిథిగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన టీచర్‌ ‌వీరబాబు.. క్లాసు రూంలో పిల్లలకు పాఠాలు చెబుతూ.. కుర్చీలో అలాగే ప్రాణాలు వదిలాడు. పాఠాలు చెబుతున్న మాస్టారు.. ఒక్కసారిగా కుర్చీలోనే  కూలడటంతో పిల్లలకు అర్థం కాక కేకలు వేశారు. పక్క గదుల్లో క్లాసులు చెబుతున్న మిగతా ఉపాధ్యాయులు ఏం జరిగిందో తెలుసుకోవటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే టీచర్‌ ‌వీరబాబు కుర్చీలో కూలబడి ఉండటాన్ని గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గ్రామంలో డాక్టర్‌ను పిలిపించారు.
అతను వచ్చి పరీక్ష చేయగా.. అప్పటికే చనిపోయినట్లు స్పష్టం చేశారు. దీంతో తోటి ఉపాధ్యాయులు టీచర్‌ ‌వీరబాబును అంబులెన్స్ ‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి మార్చి 4వ తేదీ మధ్యాహ్నం వరకు.. అంటే 24 గంటల్లోనే తెలుగు రాష్టాల్ల్రో ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో చనిపోవటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ ‌లోని ఓ ప్రైవేట్‌ ‌కాలేజీలో 18 ఏళ్ల ఇంజనీరింగ్‌ ‌స్టూడెంట్‌ ‌నడుస్తూ నడుస్తూ చనిపోయాడు.. పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన అపార్ట్ ‌మెంట్‌ ‌లిప్ట్ ‌దగ్గర కుప్పకూలి చనిపోయాడు.. ఇప్పుడు చీరాల మండలంలోని వాకావారిపాలెంలో ప్రభుత్వ టీచర్‌ ‌పాఠాలు చెబుతూ చనిపోయాడు.. ఈ ఘటనలతో జనంలో ఆందోళనలు నెలకొన్నాయి. గట్టి గుండెలు సడెన్‌ ‌గా ఆగిపోవటంపై ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వైరల్‌ ‌వ్యాధులు
దగ్గు, జలుబు, జ్వరం కేసులు
అదేపనిగా యాంటీబయాటిక్స్ ‌వాడొద్దు
వైద్యులకు ఐఎంఎ సూచనలు
image.pngన్యూ దిల్లీ,మార్చి4: వైరస్‌ ‌కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్‌ ‌వ్యాధులు పెరుగుతున్నాయని ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్‌ ‌వ్యాధులకు  యాంటీబయాటిక్స్  ఔషధాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు సీజనల్‌ ‌వ్యాధులకు  యాంటీబయాటిక్స్  ‌మందులు ఇవ్వొద్దని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య నిపుణులకు ఐఎంఏ సూచించింది. ఈ మేరకు ఐఎంఏ స్టాండింగ్‌ ‌కమిటీ  ఆదేశాలు జారీ చేసింది. ఐఎంఏ జారీ చేసిన ఆదేశాల మేరకు.. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమేనని పేర్కొంది. సీజనల్‌ ‌జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని తెలిపింది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పింది. అయితే దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది. రోగులకు యాంటీ బయాటిక్స్  ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్‌ ‌బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్దారించుకోవాలని సూచించింది.
లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ’ప్రజలు ఇప్పుడు అజిత్రోమైసిన్‌  , ఆమోక్సిసిలిన్‌  ‌వంటి యాంటీబయాటిక్స్ ఔషధాలను తీసుకుంటున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కొంచెం తగ్గినట్టు అనిపించగానే వాటిని ఆపేయాలి. లేదంటే యాంటీబయాటిక్‌ ‌రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్స్ అవసరం ఏర్పడినప్పుడు అవి సమర్థవంతంగా పనిచేయవు’ అని ఐఎంఏ తెలిపింది. అయితే సంబంధిత లక్షణాలు లేనప్పటికీ వైద్యులు ఎక్కువగా యాంటీబయాటిక్స్ ‌సూచిస్తుండటాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. డయేరియాకు  కూడా వైద్యులు యాంటీబయాటిక్స్‌నే ఇస్తున్నారని తెలిపింది. 70 శాతం డయేరియా  కేసులు వైరల్‌ ‌వల్ల వస్తున్నవని పేర్కొంది.  వైరల్‌ ‌వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ‌పనిచేయవని పేర్కొంది. ఇందు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రమణ నివారణకు స్వీయ నియంత్రణను పాటించాలని ప్రజలకు సూచించింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఐఎంఏ తన నోటీసుల్లో సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page