గీతం స్కాలర్ తానూ శ్రీ వాస్తవకు పీహెచ్ డీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 1: గీతం డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తానూ శ్రీ వాస్తవకు డాక్టరేట్ వరించింది. ఏరో స్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంపై అభివృద్ధి, అధ్యయనం అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. నరేష్ కుమార్ కటారి, ప్రొఫెసర్ రావూరి బాలాజీ రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కఠినమైన ఉష్ణ వాతావరణంలో ఏరోస్పే స్ వాహనాలకు ఉపయోగపడే కొత్త థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లను అభివృద్ధి చేయడం, పర్సనల్ ట్రయల్ తో ప్రాపర్టీ మూల్యంకనం చేయడం ఈ పరిశోధన లక్ష్యంగా పేర్కొన్నారు. మధ్యాహ్నం ప్రధానంగా తక్కువ సాంద్రత కలిగిన అబ్లీ టీవ్ పదార్థాలు ఖర్చుతో కూడుకున్న వాటిపై దృష్టి పెట్టిందన్నారు. ఈ పరిశోధన ప్రధాన ఫలితాలు అభివృద్ధి చెందిన ఉష్ణ రక్షణ వ్యవస్థలు తీవ్ర వాతావరణాలలో అధిక ఉష్ణోగ్రత అనువర్తనాల కోసం నిరూపించబడినట్లు తెలిపారు. ఆబ్లేటివ్ పదార్థాలు ఇప్పటికే ఉన్న వ్యవస్థల కంటే మెరుగైన లక్షణాలు తక్కువ నుంచి మద్యస్థ సాంద్రత కలిగి ఉన్నాయని నిరూపించినట్లు పేర్కొన్నారు. తాను శ్రీ వాస్తవ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పిహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె. నాగేష, రసాయన శాస్త్ర విభాగపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page