Take a fresh look at your lifestyle.

‌క్రిమినల్‌ ‌పక్రియ మరింత సులభతరం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 11 : క్రిమినల్‌ ‌జస్టిస్‌ ‌సిస్టమ్‌కు సంబంధించి పక్రియను మరింత సులభతరం చేయడంపై సీనియర్‌ అధికారులతో డిజిపి కార్యాలయంలో శనివారం ఇంటరాక్షన్‌ ‌సెషన్‌ను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు సాంకేతికతకు సంబంధించి మెరుగైన అవగాహన కల్పించడంపై కూడా చర్చ జరిగింది.

జమావేశంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌,  ‌బి శివానంద ప్రసాద్‌, ఇతర సీనియర్‌ ‌ప్రభుత్వ ప్లీడర్ల బృందం, డిజిపి అంజనీ కుమార్‌, ఎడిజి లీగల్‌ ‌కె శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎడిజి డా.సౌమ్య మిశ్రా, ఐజిపి పర్సనల్‌, ‌విబి కమలాసన్‌ ‌రెడ్డి, జాయింట్‌ ‌సిపి వి సత్యనారాయణ, హోమ్‌ ‌సెక్రటరీ డా. జితేందర్‌ ‌పాల్గొన్నారు.  ప్రతి త్రైమాసికంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply